Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.450 ప్రియమైంది. కేజీ వెండి రూ.వెయ్యి మేర పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,200గా ఉంది. కిలో వెండి ధర రూ.70,000 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.54,200 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,000గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,000 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.54,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,000 వద్ద కొనసాగుతోంది.
- స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..:అంతర్జాతీయంగానూ బంగారం ధర భారీగా పెరిగింది. ఔన్సు బంగారం 14 డాలర్లు అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,958 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.21 డాలర్లుగా ఉంది.
మధ్యాదాయ వర్గాలకు బంగారం:దేశంలో బంగారం కొనుగోళ్లకు సంబంధించి ఓ నివేదిక ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. మధ్యాదాయ వర్గాలే అధికంగా బంగారాన్ని కొంటున్నాయని ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్(ఐజీపీసీ) విడుదల చేసిన 'గోల్డ్ అండ్ గోల్డ్ మార్కెట్స్' నివేదిక పేర్కొంది. 'బంగారం తలసరి వినియోగం సంపన్నుల్లోనే ఎక్కువగా ఉంది. కానీ, ఎక్కువ మొత్తంలో బంగారం మాత్రం మధ్యాదాయ వర్గాల వద్దే ఉంది' అని నివేదిక వివరించింది. రూ.2 లక్షల నుంచి రూ10 లక్షల మధ్య ఆదాయం కలిగిన వర్గాలే.. 56 శాతం బంగారాన్ని వినియోగిస్తున్నాయని స్పష్టం చేసింది. బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్లే కొనుగోళ్లు పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. రూ.10 లక్షల కన్నా అధిక ఆదాయం కలిగిన వర్గాలు.. అదనపు ఆదాయంపైనే అధికంగా దృష్టిసారిస్తున్నట్లు నివేదిక అంచనా వేసింది. ఈ గ్రూపు వ్యక్తులు ఎక్కువగా స్టాక్ మార్కెట్లు, డెరివేటివ్స్, రియల్ ఎస్టేట్ రంగాలపై పెట్టుబడులు పెడుతున్నారని తెలిపింది.