Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1,060 పెరిగి.. ప్రస్తుతం రూ.54,000 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.350 పెరిగి రూ.60,130 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,000గా ఉంది. కిలో వెండి ధర రూ.60,130 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.54,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.60,130గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,130 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.54,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,130 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 1,809 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 20.02 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
రూపాయి విలువ:అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ తగ్గింది. మంగళవారం మార్కెట్లు ప్రారంభమయ్యాక 9 పైసలు నష్టపోయి.. 79.04కు చేరుకుంది. సోమవారం రూపాయి విలువ 78.95 పైసలు ఉండేది.