తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్​, విశాఖలో నేటి లెక్కలు ఇలా.. - బంగారం వెండి ధరలు

Gold Price Today: బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,530గా ఉంది. కిలో వెండి ధర రూ.61,000గా ఉంది.

gold price
బంగారం ధర

By

Published : Jun 30, 2022, 12:52 PM IST

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,530 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.200 తగ్గి రూ. 61,000 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,530గా ఉంది. కిలో వెండి ధర రూ.61,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,530గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,000గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,530గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,530గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,000 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 1817 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 20.82 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ తగ్గింది. ప్రస్తుతం రూ.16,15,000 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.16,15,000
ఇథీరియం రూ.88,143
టెథర్ రూ.83.12
బినాన్స్​ కాయిన్ రూ.17,731
యూఎస్​డీ కాయిన్ రూ.83.23

Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి. ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​.. 9 పాయింట్ల నష్టంతో.. 53 వేల 017 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 28 పాయింట్లు దిగజారి.. 15 వేల 770 వద్ద కొనసాగుతోంది.యాక్సిస్​ బ్యాంక్​, కొటక్​ బ్యాంక్​, మారుతి​ లాభాల్లో ట్రేడవుతుండగా.. టెక్​ మహీంద్రా, విప్రో, సన్​ఫార్మా నష్టాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి :రాష్ట్రాలకు పరిహారం కొనసాగింపుపై ఎటూ తేల్చని జీఎస్టీ మండలి

ABOUT THE AUTHOR

...view details