తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - తెలంగాణ బంగారం ధర

Gold Price Today: బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,300గా ఉంది. కిలో వెండి ధర రూ.61,300గా ఉంది.

gold price today
gold price today

By

Published : Jun 24, 2022, 10:38 AM IST

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం బంగారం ధర రూ.200 తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,300 వద్ద ఉంది. వెండి ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.750 తగ్గి రూ.61,300 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,300గా ఉంది. కిలో వెండి ధర రూ.61,300 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,300గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,300 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,300గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,300 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,300గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,300 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర తగ్గింది. ప్రస్తుతం 1824 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.02 డాలర్లుగా ఉంది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78 వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ పెరిగింది. ప్రస్తుతం రూ.17,43,714 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.17,43,714
ఇథీరియం రూ. 95,586
టెథర్ రూ.82.51
బినాన్స్​ కాయిన్ రూ.19,319
యూఎస్​డీ కాయిన్ రూ.82.58

Stock Market Updates: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు శుక్రవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ దాదాపు 440 పాయింట్ల లాభంతో 52 వేల 700 ఎగువన కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిప్టీ 150 పాయింట్లకుపైగా పెరిగి.. 15 వేల 700 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో దాదాపు అన్నీ లాభాల్లోనే ఉన్నాయి. హీరో మోటోకార్ప్​, ఐచర్​ మోటార్స్​, భారతీ ఎయిర్​టెల్​, టాటా మోటార్స్​, మారుతీ సుజుకీ రాణిస్తున్నాయి. ఏషియన్​ పెయింట్స్​​, రిలయన్స్​ నష్టాల్లో ఉన్నాయి.

ఇవీ చదవండి:రూ.4.3లక్షల కోట్లకు భారత మీడియా, వినోద రంగం!

అదానీ పెద్ద మనసు.. సమాజసేవ కోసం రూ.వేల కోట్లు

ABOUT THE AUTHOR

...view details