తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Loan Vs Gold Sale : డబ్బు కోసం.. బంగారాన్ని అమ్మాలా? తాకట్టు పెట్టాలా? - loan limit on gold sale

Gold Loan Vs Gold Sale Full Details In Telugu : ఆర్థిక అవసరాలు ఎవరికి ఏ రూపంలో వస్తాయో ఎవరూ ఊహించలేరు. అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది రుణం. సాధారణంగా బ్యాంకులు మంచి క్రెడిట్ స్కోర్​ లేకపోతే రుణాలు మంజూరు చేయవు. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న బంగారం మనల్ని ఆదుకుంటుంది. మరి వాస్తవానికిి బంగారాన్ని తాకట్టు పెట్టడం మంచిదా? లేదా విక్రయించడం మంచిదా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Loan vs Gold Sale Full Details In Telugu
Is Gold Sale Better or Gold Loan Better

By

Published : Aug 9, 2023, 2:08 PM IST

Gold Loan Vs Gold Sale Full Details In Telugu : మన దేశంలో మహిళలు బంగారాన్ని అమితంగా ప్రేమిస్తారు. అయితే అంతగా ఇష్టపడే వస్తువును కొన్నిసార్లు మన ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు రుణ సంస్థల వద్ద తాకట్టు పెట్టి రుణం పొందాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మన బంగారాన్ని అమ్మేసి కూడా డబ్బును తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకోవడం మంచిదా? లేదా దాన్ని ఒకేసారి అమ్మేసి నగదు పొందడం బెటరా? అనేది ప్రతిఒక్కరిలో ఉత్పన్నమయ్యే పెద్ద ప్రశ్న. అలాంటి సమయాల్లో సరైన అవగాహన లేక తాము నష్టపోయే పద్ధతికే ఎక్కువగా మొగ్గు చూపిస్తుంటారు. అయితే బంగారం ద్వారా నగదు పొందాలని భావించేవారు.. ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఒకవేళ అమ్మాలనుకుంటే..
Gold Sale Pros And Cons : తమ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చాలా మంది బంగారాన్ని అమ్మడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో బంగారం ధర భవిష్యత్‌లో తగ్గుతుందని మీరు భావిస్తే దాన్ని మార్కెట్లో విక్రయించవచ్చు. అయితే అత్యవసర పరిస్థితుల్లో బంగారాన్ని అమ్మాలని నిర్ణయించుకుంటే గనుక దాన్ని మీరు కొనుగోలు చేసిన ఆభరణాల వ్యాపారికే విక్రయించడం మంచిది. భౌతిక బంగారాన్ని కొనడం సులభమే.. కానీ, దాన్ని అమ్మడం అంత లాభసాటి కాదు. నగల వ్యాపారి మీరు అమ్మే బంగారం నాణ్యతను కచ్చితమైన పద్ధతిలో చూస్తారు. ప్రస్తుత రోజుల్లో హాల్‌మార్క్‌ అనేది గోల్డ్​ నాణ్యత ప్రమాణాలకు తప్పనిసరి. చాలా మంది వ్యాపారులు ఇన్‌వాయిస్‌ రసీదులు లేకుండా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. కనుక అన్ని జాగ్రత్తలు తీసుకుని బంగారాన్ని విక్రయిస్తే.. మీరు నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ అవుతాయి.

బేరీజు వేసుకోండి..
Gold Sale Vs Gold Purchase : సాధారణంగా బంగారం కొనుగోలు, అమ్మకం ధరలకు మధ్య చాలా వ్యాత్యాసం ఉంటుంది. అందుకని మనం బంగారం విక్రయించేటప్పుడు (Is Gold Sale a Best Choice) దాని కొనుగోలు చేసిన రేటు, అమ్మేటప్పుడు వస్తున్న మొత్తాన్ని బేరీజు వేయండి. రెండింటి మధ్య వ్యత్యాసాన్ని స్ప్రెడ్‌ అంటారు. ఉదాహరణకు 10 గ్రాముల 24K బంగారాన్ని మీపు రూ.65,000కు కొన్నారు. దీనినే మీరు అమ్మటానికి వెళ్లినప్పుడు దానికి రూ.60,200 రేటును నిర్ణయించారు. అంటే రూ.800 స్ప్రెడ్‌ను బంగారం షాప్​ యజమాని మీ దగ్గర వసూలు చేశాడు. అయితే మనం బంగారం కొనుగోలు చేసే సమయంలో మేకింగ్ ఛార్జీలు, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, నగల వ్యాపారికి ఈ అభరణాలను విక్రయించేటప్పుడు అవన్నీ పరిగణనలోకి తీసుకోడు. అంతేకాకుండా బంగారు ఆభరణాలలో విలువైన రాళ్లు ఉన్నాసరే వాటికి విలువ కట్టరు. ప్రస్తుతం కొన్ని ఫైనాన్స్ కంపెనీలు బంగారాన్ని తీసుకొని, విక్రయదారుకు వెంటనే డబ్బును అందిస్తున్నాయి.

అమ్మినా సరే కట్టాలి..
Taxes On Gold Sales : మీరు బంగారం కొన్నప్పుడే కాదు.. దాన్ని అమ్మేటప్పుడు కూడా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. బంగారాన్ని కొన్న మూడేళ్లలోపు దాన్ని విక్రయిస్తే.. దాని లాభాలపై పన్ను స్లాబ్‌ ప్రకారం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. 3 సంవత్సరాల వ్యవధి తర్వాత అమ్మితే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 20.80% పన్ను (ఇండెక్సేషన్‌తో పాటు) విధిస్తున్నారు.

గోల్డ్​ లోన్​ మంచిదేనా..?
Is Gold Loan Good : అత్యవసర పరిస్థితుల్లో మీకు డబ్బు అవసరం ఏర్పడినప్పుడు మీ బంగారాన్ని అమ్మడం కంటే తాకట్టు(Why Gold Loan Is Better) పెట్టడానికే మీరు ఇష్టపడితే గనుక రుణసంస్థలను ఆశ్రయించవచ్చు. దీనితో మీకు నగదు కూడా వేగంగా అందుతుంది. మీ ఆర్థిక అత్యవసర అవసరాలను కూడా తీర్చుకోవచ్చు. వాస్తవానికి భవిష్యత్‌లో బంగారం ధర పెరుగుతుందని మీరు భావిస్తున్నట్లయితే గనుక బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడమే మేలు.

75 శాతమే ఇస్తాయి..
Loan Limit On Gold Loan : సాధారణంగా 18K-24K స్వచ్ఛతతో కూడిన బంగారు నాణేలు, బిస్కెట్లు, ఆభరణాలు లాంటి బంగారు వస్తువులపై రుణం లభిస్తుంది. బంగారం నాణ్యత ఆధారంగా ఎంత రుణం మంజూరు చేయాలనేది రుణ సంస్థలు నిర్ణయిస్తాయి. చాలా బ్యాంకులు బంగారం (ప్రస్తుత మార్కెట్‌) విలువలో 75% వరకు రుణాల్ని అందిస్తున్నాయి. ఈ రుణాల మెచ్యురిటీ 3 సంవత్సరాల వరకు ఉంటుంది. కాగా, కొన్ని రుణ సంస్థలు రుణ మొత్తంలో దాదాపు 0.50% నుంచి 1% వరకు ప్రాసెసింగ్‌ రుసుమును వసూలు చేస్తున్నాయి.

వీటితో ఎన్నో లాభాలు..
Gold Loan Vs Gold Sale : గోల్డ్​ లోన్స్​ తీసుకునేటప్పుడు బంగారాన్ని తాకట్టుగా ఉపయోగిస్తారు. దీనితో రుణ సంస్థలకు పెద్దగా రిస్క్‌ ఉండదు. అందుకే రుణ సంస్థలు బంగారు రుణాలను త్వరగా ప్రాసెస్‌ చేస్తాయి. అయితే రుణం కోసం దరఖాస్తు చేయడానికి కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఇవి సెక్యూర్డ్‌ రుణాలు గనుక తక్కువ వడ్డీ (7-14%) రేటుకే రుణం లభిస్తుంది. అయితే చాలా ఎన్‌బీఎఫ్‌సీలు భౌతిక బంగారంపై ప్రాసెసింగ్‌ ఫీజులను వసూలు చేయడం లేదు. ముందస్తు చెల్లింపులకు రుసుమలు విధించడం లేదు. అంతేకాకుండా ఈ సంస్థల్లో తీసుకునే బంగారు రుణాలకు క్రెడిట్‌ హిస్టరీ కూడా అవసరం లేదు. అలాగే తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు లాకర్​లో భద్రంగా ఉంచుతాయి.

డిజిటల్‌లో మదుపు చేస్తే..
Gold Digital Investment : మీ బంగారాన్ని డిజిటల్‌ రూపంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే గనుక.. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లు మొదలైనవి సరైన ఆప్షన్స్​. వీటిని విక్రయించడం కూడా చాలా సులువు. వీటిని కొద్ది రోజుల్లోనే రిడీమ్‌ కూడా చేసుకోవచ్చు. ఇందుకోసమే డిజిటల్‌ మార్గంలో బంగారాన్ని కొనుగోలు చేయమని మార్కెట్​ నిపుణులు చెబుతుంటారు.

ABOUT THE AUTHOR

...view details