Godawari E Scooter Launch : గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ భారత మార్కెట్లో ఎబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంఛ్ చేసింది. గోదావరి ఆటోమొబైల్ కంపెనీ రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం. దీనిని రాయ్‌పుర్ ఫ్యాక్టరీలో తయారుచేశారు. గోదావరి ఎబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఆగస్టు 15నే ప్రారంభమయ్యాయి. ఆగస్టు 23 నుంచి వినియోగదారులకు ఈ-స్కూటర్లు డెలివరీ చేస్తున్నారు.
గోదావరి ఎబ్లూ ఫియో ఫీచర్స్
Godawari Eblu Feo Electric Scooter Features :గోదావరి ఎబ్లూ ఫియో ఈ-స్కూటర్‌ను ప్రస్తుతానికి సింగిల్ వేరియంట్లో మాత్రమే తీసుకొచ్చారు. దీనిని టైమ్‌లెస్ డిజైన్‌తో, సుపీరియర్ కంఫర్ట్‌తో రూపొందించినట్లు.. గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ సీఈఓ హైదర్‌ఖాన్ తెలిపారు.
ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఎబ్లూ ఫియో స్కూటర్లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, డ్యూయల్ ట్యూబ్ ట్విన్ షాకర్ ఉన్నాయి. ఇవి సౌకర్యవంతమైన ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ స్కూటీలో ముందు, వెనుక భాగాల్లో CBS డిస్క్ బ్రేకులు అమర్చారు. ఇంకా దీనిలో సైడ్ స్టాండ్ సెన్సార్ ఇండికేటర్, బ్లూటూత్ నేవిగేషన్ కనెక్టివిటీ, సర్వీస్ అలర్ట్, 7.4 అంగుళాల డిజిటల్ ఫుల్ కలర్ డిస్ప్లే, రివర్స్ ఇండికేటర్, బ్యాటరీ Soc ఇండికేటర్, బ్యాటరీ అలర్ట్, హెల్మెట్ ఇండికేటర్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఉన్నాయి.
గోదావరి ఎబ్లూ ఫియో స్కూటర్ రేంజ్
Godawari Eblu Feo Electric Scooter Range :ఈ గోదావరి ఎబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్లో.. 2.52 కిలోవాట్ లిథియం-ఐయాన్ బ్యాటరీ ప్యాక్‌ను పొందుపరిచారు. ఇది 110Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ స్కూటీ బ్యాటరీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, గంటకు 60 కి.మీ వేగంతో.. ఏకంగా 110 కి.మీ వరకు ప్రయాణించవచ్చు అని కంపెనీ చెబుతోంది.
గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ కంపెనీ ఈ స్కూటర్‌తో 60 వాట్ కెపాసిటీ ఉన్న హోమ్ ఛార్జర్‌ను కూడా అందిస్తోంది. ఇది 5 గంటల 25 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.
ఈ గోదావరి ఎబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్లో.. ఎకానమీ, నార్మల్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.
గోదావరి ఎబ్లూ ఫియో డిజైన్ అండ్ కలర్
Godawari Eblu Feo Electric Scooter Design : ఈ గోదావరి ఎబ్లూ ఫియో ఈ-స్కూటర్.. సియాన్ బ్లూ, వైన్ రెడ్, జెట్ బ్లాక్, టెలి గ్రై, ట్రాఫిక్ వైట్ అనే 5 రంగుల్లో లభిస్తుంది. దీనిలో హై-రిజల్యూషన్ AHO LED హెడ్‌ల్యాంప్, LED టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. దీనిలో 12 అంగుళాల మార్చుకోగలిగిన ట్యూబ్‌లైస్ టైర్లు ఉన్నాయి. అలాగే ఈ-స్కూటర్‌కు 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది.
గోదావరి ఎబ్లూ ఫియో ధర
Godawari Eblu Feo Electric Scooter Price :గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ తమ మొదటి ఈ-స్కూటర్‌ను బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం దీని ధరను రూ.99,999గా నిర్ణయించింది.