GDP Growth Rate: 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు 8.9 శాతంగా అంచనా వేయగా 8.7 శాతం మాత్రమే నమోదైంది. మూడో త్రైమాసికంలో 5.4 శాతంగా ఉన్న వృద్ధిరేటు నాలుగో త్రైమాసికంలో 4.1శాతానికే పరిమితమైంది. అయితే 2020-21 జనవరి మార్చి మధ్యకాలంలోనూ 2.5 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదైనట్లు జాతీయ గణాంకాల కార్యాలయం- ఎన్ఎస్ఓ ఒక ప్రకటనలో తెలిపింది.
2020-21లో వృద్ధిరేటు 6.6 శాతం క్షీణించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఎన్ఎస్ఓ రెండో ముందస్తు అంచనాల్లో వృద్ధిరేటును 8.9 శాతంగా పేర్కొంది. ఈ ఏడాది మొదటి మూడునెలల్లో చైనా వృద్ధి రేటు 4.8 శాతంగా నమోదైంది.
జీడీపీ వృద్ధిరేటు 8.7 శాతం.. పెరిగిందా? తగ్గిందా? - National Statistical Office
GDP Growth Rate: 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 8.7 శాతంగా నమోదైంది. ఈ మేరకు అధికారిక గణాంకాల్లో వెల్లడైంది. చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 4.1 శాతం.
GDP grows 4.1 pc in Jan-Mar qtr; 8.7 pc in FY22