తెలంగాణ

telangana

ETV Bharat / business

హిండెన్​బర్గ్​ ఎఫెక్ట్​.. రూ.6 లక్షల కోట్ల అదానీ సంపద ఆవిరి!

నెల రోజుల క్రితం అపర కుబేరుడు గౌతమ్‌ అదానీ సంపద విలువ 120 బిలియన్‌ డాలర్లు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఏకంగా మూడో స్థానంలో ఉండే గౌతమ్‌ అదానీ హిండెన్‌బర్గ్‌ ఎఫెక్ట్‌తో 25వ స్థానానికి పడిపోయారు. అనేక ఏళ్ల తర్వాత గౌతమ్‌ అదానీ సంపద 50 బిలియన్‌ డాలర్ల దిగువకు చేరింది. సుమారు 6 లక్షల కోట్ల రూపాయల అదానీ వ్యక్తిగత సంపద నెలరోజుల వ్యవధిలో ఆవిరైంది.

autam adani dropped his postion 3rd to 25th because of hinderburg report
ప్రపంచ కుబేరుల జాబితాలో 25వ స్థానానికి పడిపోయిన అదానీ

By

Published : Feb 21, 2023, 7:15 AM IST

అదానీ గ్రూప్‌ కంపెనీలపై అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణల కారణంగా గౌతమ్‌ అదానీ సంస్థ ఎన్నడూ లేని స్థాయిలో కరిగిపోతూ వస్తోంది. నెల రోజుల క్రితం 120 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో మూడోస్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ ఇప్పుడు ఏకంగా 25వ స్థానానికి పడిపోయారు. అనేక ఏళ్ల తర్వాత గౌతమ్‌ అదానీ సంపద 50 బిలియన్‌ డాలర్ల దిగువకు చేరింది. నెల రోజుల వ్యవధిలోనే గౌతమ్‌ అదానీ 72 బిలియన్ డాలర్లను కోల్పోయారు. ప్రస్తుతం ఫోర్బ్స్‌ బిలియనీర్ల రియల్‌ టైం జాబితాలో 47.9 బిలియన్‌ డాలర్లతో గౌతమ్‌ అదానీ 25వ స్థానంలో ఉన్నారు.

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్‌ తోసిపుచ్చినప్పటికీ పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థల్లో ఈ నివేదిక ఆందోళన రేకెత్తించింది. అప్పటి నుంచి అదానీ గ్రూప్‌ సంస్థల షేర్లు పతనమవుతూ వస్తున్నాయి. ఫలితంగా గౌతమ్‌ అదానీ వ్యక్తిగత సంపదపై అది ప్రభావం చూపింది. ఈ ఏడాది ఆరంభం నుంచి గౌతమ్‌ అదానీ సంపదలో ఏకంగా 72 బిలియన్‌ డాలర్లు కరిగిపోయాయి. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ల ఇండెక్స్‌లో టాప్‌-500 కుబేరుల జాబితాలో ఎక్కువ మొత్తంలో సంపద కోల్పోయిన వ్యక్తిగా గౌతమ్‌ అదానీ నిలిచారు. ప్రస్తుతం ఫోర్బ్స్‌ జాబితాలో 85.1 బిలియన్‌ డాలర్ల సంపదతో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా ఉన్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయనది 8వ స్థానం.

హిండెన్​బర్గ్​ వ్యవహారమిదే..
అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ.. హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసింది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. కాగా, ఈ నివేదిక నేపథ్యంలో ఇటీవల అదానీ సంస్థకు చెందిన కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details