Freelancer Health Insurance : కరోనా సంక్షోభం తర్వాత లైఫ్ ఇన్సూరెన్సులు చేయించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉద్యోగం చేసే వాళ్లు, వ్యాపార వేత్తలు తమ భవిష్యత్తు అవసరాల కోసం బీమా చేయించుకుంటారు. మరి స్థిరమైన ఆదాయం లేని ఫ్రీలాన్సర్ల సంగతి ఏంటి? "ఇండియాస్ గ్రోయింగ్ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం ఎకానమీ" పేరుతో నీతి ఆయోగ్ ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశ శ్రామిక శక్తిలో ఫ్రీలాన్సర్ల శాతం 4.1%కి పెరుగుతుందని అంచనా. ఇది 2018 ఆర్థిక సంవత్సరం లో 1.5%గా ఉంది.
ఫ్రీలాన్సింగ్ చేసేవారికి ఉద్యోగ భద్రత అనేది ఉండదు. కరోనా లాంటి పరిస్థితులు వస్తే వారి జీవితం ప్రశ్నార్థకమే. దీనికి తోడు ఏదైనా ఊహించని ఆర్థిక అత్యవసర పరస్థితి ఏర్పడితే ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందుకే వీరు ఆరోగ్య బీమా తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
1. ఆరోగ్య ఖర్చుల నుంచి రక్షణ..
సాధారణంగా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే.. మన జేబులోని డబ్బులే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకవేళ సమయానికి చేతిలో డబ్బులు లేకపోతే.. పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అందుకే ఆరోగ్య బీమా కచ్చితంగా తీసుకోవాలి. అత్యవసర సమయాల్లో ఇది కచ్చితంగా అక్కరకు వస్తుంది.
2. వైద్య ఖర్చులకు భద్రతా వలయం..
అనుకోకుండా మనకు ప్రమాదాలు, తీవ్రమైన అనారోగ్యాలు సంభవించవచ్చు. ఇలాంటి సమయాల్లో ఆరోగ్య బీమా ఉంటే ఒక భద్రతా వలయంగా పనిచేస్తుంది. సమయానికి చేతిలో డబ్బులు లేకపోయినా వైద్య ఖర్చులు అన్నీ బీమా సంస్థ భరిస్తుంది. కొన్నిసార్లు మన సొంత డబ్బులు ఖర్చుపెట్టినా.. తరువాత పరిహారం లభిస్తుంది. అంటే కష్ట సమయంలో ఆర్థిక ఉపశమనం లభిస్తుంది.
3. నగదు రహిత క్లెయిమ్స్
చాలా వరకు ఆరోగ్య బీమా పాలసీలు నగదు రహిత క్లెయిమ్‌లను అందిస్తాయి. మనపై ఒకేసారి పెద్దమొత్తంలో ఆర్థిక భారం పడకుండా కాపాడతాయి.
4. ముందస్తు పరీక్షలు చేయించుకునే వెసులుబాటు..
అనేక ఆరోగ్య బీమా పాలసీలు ముందస్తు వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయించుకోవడానికి అనుమతిస్తాయి. దీని వల్ల భవిష్యత్తులో వచ్చే వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవడానికి, దాంతోపాటు సదరు ఆరోగ్య సమస్యలను నివారించుకోవడానికి వీలవుతుంది.
ఆరోగ్య బీమా తీసుకునే ముందు.. ఫ్రీలాన్సర్లు గమనించాల్సిన విషయాలు!