వరుసగా రెండు నెలల పాటు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్న విదేశీ మదుపర్లు నవంబరులో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. డాలర్ ఇండెక్స్ దిగిరావడం సహా స్థూల ఆర్థిక అంశాలు మెరుగుపడడం అందుకు దోహదం చేసింది. ఈ ఏడాది మొత్తం మూడు నెలలు.. జులై, ఆగస్టు, నవంబరులో మాత్రమే విదేశీ మదుపర్లు భారత్‌లోకి పెట్టుబడులను చొప్పించారు. మిగిలిన నెలల్లో భారీ ఎత్తున ఉపసంహరించుకున్నారు.
నవంబరులో భారత ఈక్విటీల్లోకి భారీగా విదేశీ పెట్టుబడులు.. రూ.35వేల కోట్లకు పైగా.. - undefined
నవంబరులో విదేశీ మదుపర్లు తిరిగి నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. వరుసగా మూడు నెలల పాటు విక్రయించిన ఎఫ్‌పీఐలు నవంబరులో కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఈక్విటీ మార్కెట్లలో రూ.36,329 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు
నవంబరులో విదేశీ మదుపర్లు భారత్ ఈక్విటీ మార్కెట్లలో రూ.36,329 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డిసెంబరులోనూ ఈ వెల్లువ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, సూచీలు గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్న నేపథ్యంలో కొంత నిరోధం ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే ఎగువ స్థాయిల్లో ఉన్న స్టాక్స్ నుంచి నిధులు నాణ్యమైన షేర్లలోకి మళ్లే అవకాశం ఉందని అంచనా వేశారు. అమెరికాలో ద్రవ్యోల్బణం కాస్త దిగి రావడం, ముడి చమురు ధరలు తగ్గడం, కమొడిటీ, రవాణా ఖర్చులు అదుపులోకి రావడం వంటి పరిణామాలు మదుపర్ల సెంటిమెంటును పెంచాయి. మరోవైపు రేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కాస్త నెమ్మదిగా వ్యవహరించే అవకాశం ఉందన్న అంచనాలూ కలిసొచ్చాయి.
TAGGED:
equities