Floating Rate Savings Bonds : రిటైల్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. ఆర్బీఐ చెందిన రిటైల్ డైరెక్ట్ పోర్టల్‌లో.. ఇకపై రిటైల్ ఇన్వెస్లర్లు కూడా నేరుగా 'ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్, 2020' కొనుగోలు చేయడానికి అవకాశం వచ్చింది.
పెట్టుబడి అవకాశాలు!
RBI Retail Direct Scheme :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 నవంబర్ 12న ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌ను ప్రారంభించారు. రిటైల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడి అవకాశాలను మరింత సులభతరం చేసేందుకు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ స్కీమ్‌లో చేరాలంటే.. ముందుగా ఆర్బీఐ డైరెక్ట్ పోర్టల్‌లో ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఒకసారి ఈ ఖాతా తెరచిన తరువాత.. ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల్లోని ప్రభుత్వ సెక్యూరిటీల్లో రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా మదుపు చేసుకోవచ్చు.
ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్!
RBI Portal Investment Options : ఇప్పటి వరకు రిటైల్ ఇన్వెస్టర్లు.. ఆర్బీఐకు చెందిన రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా.. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ఫ్లోటింగ్ బాండ్లను కూడా చేర్చడం జరిగింది.
కాలపరిమితి ఎంత?
Floating Rate Savings Bonds 2020 Time Limit :రిటైల్ డైరెక్ట్ పోర్టల్‌లో అందించే ఉత్పత్తులను మరింత విస్తరించాలనే ఉద్దేశంతోనే.. ఆర్బీఐ తాజాగా 'ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్' సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బాండ్ల కాలపరిమితి 7 ఏళ్లు. అంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తరువాత.. కచ్చితంగా 7 ఏళ్ల పాటు ప్రతిఫలం కోసం వేచిచూడాల్సి ఉంటుంది.