తెలంగాణ

telangana

ETV Bharat / business

Flipkart plus premium membership : వావ్​!.. పూర్తి ఉచితంగా.. ఫ్లిప్​కార్ట్ న్యూ మెంబర్​షిప్ ప్రోగ్రామ్​! - flipkart big saving days 2023

Flipkart plus premium membership : వాల్​మార్ట్​ నేతృత్వంలోని ఫ్లిప్​కార్ట్ మరో సరికొత్త ప్రీమియం మెంబర్​షిప్ ప్లాన్​ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులకు అదనపు బెనిఫిట్స్ అందుతాయని స్పష్టం చేసింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలు మీ కోసం..

Flipkart new membership program 2023
Flipkart plus premium membership

By

Published : Jul 24, 2023, 7:29 PM IST

Flipkart new membership program 2023 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ తన యూజర్​ బేస్​ను మరింత పెంచుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా 'ఫ్లిప్​కార్ట్​ ప్లస్​ ప్రీమియం మెంబర్​షిప్' పేరుతో సరికొత్త సర్వీస్​ను ప్రారంభిస్తోంది. ఈ నయా మెంబర్​షిప్​ ప్లాన్​ ద్వారా తన యూజర్లకు అదిరిపోయే ఆఫర్లు, బెనిఫిట్స్​ అందించనుంది.

పూర్తి ఉచితంగా!
Flipkart plus premium membership 2023 : ఫ్లిప్​కార్ట్ ప్లస్​ ప్రీమియం మెంబర్​షిఫ్​ పొందడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్రీమియం మెంబర్​షిప్​ను పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు ఈ-కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ఫ్లిప్​కార్ట్​ ప్లస్​ ప్రోగ్రామ్​ కంటే.. దీనిలో కస్టమర్లకు మరిన్ని అదనపు ఆఫర్లు, బెనిఫిట్స్​ లభిస్తాయని పేర్కొంది. మరో రెండు వారాల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నట్లు సమాచారం.

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ సేవింగ్​ డే సేల్స్​
Flipkart big saving days 2023 : ఫ్లిప్​కార్ట్ త్వరలో బిగ్​ సేవింగ్​ డేస్​ సేల్​ను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త మెంబర్​షిప్​ ద్వారా కొత్త యూజర్లను ఆకర్షించి, తన అమ్మకాలు పెంచుకోవాలని ఫ్లిప్​కార్ట్​ భావిస్తోంది.

సూపర్ కాయిన్స్ సంపాదించండి!
Flipkart Super Coins : ఫ్లిప్​కార్ట్​లో షాపింగ్ చేసినవారికి సాధారణంగా రివార్డ్​ పాయింట్స్​ కింద సూపర్ కాయిన్స్ లభిస్తూ ఉంటాయి. ఇలా 200 సూపర్​ కాయిన్లను సంపాదించిన యూజర్లకు ఫ్లిప్​కార్ట్​ ప్లస్​ ప్రీమియం మెంబర్​షిప్​ పూర్తి ఉచితంగా లభిస్తుంది.

Flipkart membership : ఫ్లిప్​కార్ట్ ప్లస్ ప్రీమియం మెంబర్​షిప్ పొందిన యూజర్లకు.. తాము ఖర్చు చేసిన ప్రతీ రూ.100కు గాను ఒక సూపర్​ కాయిన్​ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. వీటిని వర్చువల్​ కరెన్సీగా ఉపయోగించుకోవచ్చు. అంటే వీటి ద్వారా ఫ్లిప్​కార్ట్​లో వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు.

సూపర్​ బెనిఫిట్స్​
Flipkart membership benefits : ఈ నయా ప్రీమియం మెంబర్​షిప్​ పొందిన వినియోగదారులకు ఉచిత డెలివరీ ఉంటుంది. అలాగే సాధారణ యూజర్ల కంటే ముందుగా ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో మరిన్ని అదనపు బెనిఫిట్స్​ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరిన్ని పూర్తి వివరాల కోసం మరికొన్ని రోజులు వేచిచూడాల్సి ఉంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details