Flipkart Big Saving days 2023 : ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ జులై 15 నుంచి 19 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. వర్షాకాలంలో పెడుతున్న ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్, ఫ్యాషన్ వస్తువులపై భారీ డిస్కౌంట్లతో పాటు, ఆఫర్ల జల్లు కురిపిస్తామని స్పష్టం చేసింది.
భారీ తగ్గింపు!
Flipkart big saving days 2023 deals : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో స్మార్ట్ఫోన్లపై 43 శాతం వరకు, టీవీ అండ్ అప్లాయెన్సెస్పై 75 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఫర్నీచర్‌పై 80 శాతం వరకు, రిఫ్రిజిరేటర్లపై 60 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు అందిస్తోంది. ఫ్యాషన్ దుస్తులు, వస్తువులపై 50% నుంచి 80% వరకు భారీ తగ్గింపును అందిస్తోంది. ఇవే కాకుండా అదిరిపోయే బ్యాంక్ డిస్కౌంట్స్, ఆఫర్స్, డీల్స్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది.
బ్యాంక్ డిస్కౌంట్స్!
Flipkart big saving days 2023 bank offers :
- యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
- ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం వరకు అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అదే విధంగా ఈ కార్డుపై 16 శాతం వరకు సూపర్ కాయిన్స్‌ను కూడా పొందవచ్చు.
- ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్ కింద ఒక్క లక్ష రూపాయల వరకు క్రెడిట్ పొందవచ్చు.
- పేటీఎం పేమెంట్స్ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్‌పై కూడా మంచి సేవింగ్స్ పొందవచ్చు.
- బజాజ్ ఫిన్సెర్వ్ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
ఒక్క రోజు ముందుగానే!
Flipkart big saving days for plus members : ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్‌స్క్రైబర్స్‌కు ఒక రోజు ముందుగానే అంటే జులై 14 నుంచే ఈ బిగ్ సేవింగ్ డే సేల్ ప్రారంభమవుతుంది.