Flipkart big saving days 2023 : స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్డ్ బిగ్ సేవింగ్ డేస్‌ను ప్రకటించింది. జూన్ 10 నుంచి జూన్ 14 వరకు ఈ బంపర్ సేల్ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ లిమిటెడ్ పీరియడ్ సేల్‌లో ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 23, పోకో ఎక్స్5 సహా పలు స్మార్ట్ఫోన్లపై మంచి డిస్కౌంట్, ఆఫర్లను అందిస్తున్నట్లు పేర్కొంది. బ్యాంకు ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ డీల్ కూడా ఉంటాయని స్పష్టం చేసింది.
iPhone 13
ఫ్లిప్‌కార్ట్.. ఐఫోన్ 13.. 128జీబీ వేరియంట్ ధరను రూ.58,749గా నిర్ణయించింది. వాస్తవానికి యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ విలువ రూ.69,900గా ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్ దీనిపై రూ.11,151 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తుంది. దీనికి తోడు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఓవరాల్‌గా 5జీ ఐఫోన్‌ను రూ.57,999లకే కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు.
Poco X5 5G
పోకో ఎక్స్5 5జీ ధర రూ.15,999గా ఉంచింది. వాస్తవానికి దీనిని రూ.14,999 వద్ద కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. భారత మార్కెట్లో దీనిని లాంఛ్ చేసినప్పుడు కంపెనీ దీని ధరను రూ.18,999గా పేర్కొంది. ఈ ధరతో పోల్చుకుంటే ప్రస్తుతం దీనిపై ఫ్లిప్‌కార్ట్ రూ.4,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది.
Samsung Galaxy F23 5జీ
ఈ సంవత్సరం మార్చిలో భారత మార్కెట్లోకి విడుదలైన ఈ ఫోన్ అసలు ధర రూ.17,999 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ దీనిని రూ.13,499కే అందుబాటులోకి తెచ్చింది. అంటే దీనిపై రూ.6,500 డిస్కౌంట్ లభిస్తుంది.