తెలంగాణ

telangana

ETV Bharat / business

Flipkart Big Billion Days Sale Offers : ఫ్లిప్​కార్ట్ 'బిగ్​ బిలియన్ డేస్​'.. ఈ స్మార్ట్​ఫోన్లపై బంపర్ ఆఫర్స్ - ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ రోజుల ఆఫర్ల జాబితా

Flipkart Big Billion Days Sale 2023 : ఫ్లిప్​కార్ట్ 'బిగ్​ బిలియన్ డేస్​' పేరిట మరికొద్ది రోజుల్లో ప్రత్యేక సేల్ ప్రారంభం కానుంది. భారీ అఫర్లతో ఈ బీబీడీ సేల్స్​ నిర్వహించేందుకు సిద్ధమైంది ఫ్లిప్​కార్ట్​. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని టీజర్​ పేజీలను తన అధికారిక వెబ్​సైట్​లో పోస్ట్​ చేసింది. వీటిని బట్టి ఎలక్ట్రానికి డివైజ్​లపై ఈసారీ భారీగానే ఆఫర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది.

Flipkart Big Billion Days Sale 2023
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 4:33 PM IST

Updated : Sep 21, 2023, 5:34 PM IST

Flipkart Big Billion Days Sale 2023 :ఆన్​లైన్​ షాపింగ్​ ప్రియులకు శుభవార్త అందించింది ఫ్లిప్​కార్ట్​. 'బిగ్​ బిలియన్ డేస్​ సేల్'​తో భారీ ఆఫర్లను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తన అధికారిక వైబ్​సైట్​ హోం పేజీలో కొన్ని టీజర్​ పేజీలను పోస్ట్​ చేసింది. ఈ టీజర్​ పేజీలను బట్టి చూస్తే ప్రముఖ బ్రాండ్​ మొబైళ్లపై భారీ ఆఫర్లే ఉండనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్​లో వివిధ పండగలు రానున్న నేపథ్యంలో ఈ భారీ ఆఫర్లను ఫ్లిప్​కార్ట్​ ఇవ్వనున్నట్లు అర్థమవుతోంది.

ఫ్లిప్​కార్ట్​ టీజర్​ పేజీల ఆధారంగా రియల్​మీ, పోకో, వీవో, సామ్​సంగ్​, మోటరోలా ఇంకా ఇతర ప్రముఖ బ్రాండ్​ మొబైళ్లపై భారీ ఆఫర్లు ఉండనున్నాయి. ఐఫోన్​లపై కూడా భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది ఫ్లిప్​కార్ట్​. అయితే 'బిగ్​ బిలియన్​ డేస్​ సేల్స్​' ఏ తేదీ నుంచి ప్రారంభవుతాయో మాత్రం చెప్పలేదు ఫ్లిప్​కార్ట్​. అయితే.. అక్టోబర్ 1నుంచి 'బిగ్​ బిలియన్ డేస్​ సేల్' మొదలవుతాయని సమాచారం. ఈ బీబీడీ సేల్స్​లో పలు కొత్త ఫోన్లు కూడా లాంఛ్​ అవుతున్నాయి. ఫ్లిప్​కార్ట్​ వెబ్​సైట్​ ప్రకారం.. మొత్తం 6 కొత్త ఫోన్లు విడుదల కానున్నాయి.

ఫ్లిప్​కార్ట్​ బీబీడీ సేల్స్​లో డిస్కౌంట్లు ఉండే ఫోన్లు ఇవే..

  • శాంసంగ్​ గెలాక్సీ ఎస్21 ఎఫ్​ఈ(128 జీబీ)
  • రియల్​మీ సీ51
  • శాం​సంగ్​ గెలాక్సీ ఎఫ్​34 5జీ
  • మోటరోలా జీ54 5జీ
  • రియల్​మీ 11ఎక్స్​ 5జీ
  • ఇన్ఫినిక్స్​ జీరో 5జీ
  • మోటో జీ84
  • వీవో వీ29ఈ
  • పోకో ఎమ్​6 ప్రో 5జీ, ఇంకా మరిన్ని ఫోన్లపై డిస్కౌంట్లు ఉండనున్నాయి.
  • ఈ సేల్​కు ముందుగానే మోటో ఎడ్జ్​ 40 నియో, వీవో టీ2 ప్రో ఫోన్లు విడుదల కానున్నాయి.

వీటితో పాటు ఈ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్స్​లో వివిధ రకాల బెని​ఫిట్స్​ను కూడా ఇవ్వనుంది ఫ్లిప్​కార్ట్​. స్మార్ట్​ఫోన్ల కొనుగోళ్లపై బ్యాంక్​ డిస్కౌంట్లను అందించనుంది. ఫోన్లపై ఎక్స్ఛేంజ్​ బోనస్​లు కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది. వీటితో పాటు నో కాస్ట్​ ఈఎమ్​ఐ సదుపాయం కూడా కల్పించనుంది. ​అధిక ధరతో ఎక్స్ఛేంజ్​లకు సైతం ఫ్లిప్​కార్ట్ హామీ ఇచ్చింది.

జీరో అవర్​ సేల్..​
ఈ బిగ్​​ బిలియన్ డేస్​ సేల్స్​లలో "జీరో అవర్​"ను కూడా తీసుకువస్తుంది ఫ్లిప్​కార్ట్. ఈ 'జీరో అవర్'​ సరిగ్గా ఉదయం 7 గంటలకు ప్రారంభవుతుంది. ఈ టైంలో కోనుగోళ్లపై అదనపు డీల్స్​, రివార్డ్​లను వినియోగదారులు పొందవచ్చు.

ATM Withdraw Issues : ఏటీఎంలో డబ్బులు రాలేదా..? బ్యాంకులు రోజుకు రూ.100 ఇవ్వాల్సిందే..!

CIBIL Score Correction Process : లోన్ స‌క్ర‌మంగా క‌ట్టినా.. సిబిల్ స్కోర్​ త‌గ్గిందా?.. సింపుల్​గా ఫిర్యాదు చేయండిలా!

Last Updated : Sep 21, 2023, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details