తెలంగాణ

telangana

ETV Bharat / business

FD Vs NSC : ఫిక్స్‌డ్ డిపాజిట్ Vs నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్.. దేంట్లో రాబడి ఎక్కువ..? - ఉత్తమ పొదుపు పథకాలు

Tax Saver Bank Fixed Deposits Vs National Savings Certificate : ప్రస్తుతం సంపాదించిన డబ్బులపై అధిక రాబడి పొందేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఫిక్స్​డ్ డిపాజిట్లతో పాటు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లాంటి ప్రభుత్వ పథకాలున్నాయి. అయితే చాలా మంది ఈ రెండింటిలో ఏది బెటర్​? దేంట్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుంది? అని ఆలోచిస్తుంటారు. ఇక ఆలస్యమెందుకు ఇది చదివి మీరే నిర్ణయం తీసుకోండి.

Bank Fixed Deposits
National Savings Certificate

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 3:40 PM IST

Fixed Deposits Vs National Savings Certificate which is Best :కష్టపడి సంపాదించిన డబ్బును.. సరిగా పొదుపు చేయడం అందరికీ తెలియదు. వారికి తెలియకుండానే డబ్బు ఖర్చైపోతూ ఉంటుంది. అందుకే.. త్వరగా మంచి పొదుపు పథకాలను(Investment Schemes) ఎంచుకొని పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే.. మెచ్యూరిటీ లేదా రిటైర్​మెంట్ సమయానికి పెద్ద మొత్తంలో మనీ రిటర్న్ పొందవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

Bank FDs Vs NSC Which is Better Choice :అయితే.. చాలా మంది డబ్బును దాచుకోవడం, దానిపై అధిక వడ్డీ పొందడం కోసం ఫిక్స్​డ్ డిపాజిట్ (ఎఫ్​డీ)మేలైన మార్గంగా ఎంచుకుంటారు. ఇటీవల పోస్టాఫీసు పొదుపు పథకాల(Post Office Savings Schemes) వడ్డీ రేట్ల పెంపుతో చాలా మంది ఆలోచనలో పడ్డారు. ఎఫ్​డీలో డబ్బు దాచాలా? పోస్టాఫీసులో పొదుపు చేయాలా? అని తేల్చుకోలేకపోతున్నారు.

టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు(Tax Saver Bank Fixed Deposits) :సాధారణంగా డబ్బులను పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అయితే చాలా మంది పన్ను ఆదా చేసుకునేందుకు చిన్న పొదుపు పథకమైన టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల(Tax Saving FD)లో పెట్టుబడి పెడుతుంటారు. ఇలా చేయటం వల్ల పన్ను ఆదా అవుతుంది. ఇంకా.. పొదుపు ప్రయోజనాలు సకాలంలో అందుతాయి. అంతేకాదు.. ఎఫ్​డీలు ఎలాంటి భయం లేని సురక్షితమైనవి కూడా. ఫిక్స్​డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటు కూడా స్థిరంగా ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్-80D ప్రకారం ప్రయోజనాలను పొందవచ్చు. అయితే.. ఈ ఎఫ్​డీల్లో ఏడాదికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

Govt Bank FD Interest Rates 2023 : ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేస్తున్నారా?.. అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే!

దేశంలోని ప్రధాన బ్యాంకులు అందించే తాజా టాక్స్ సేవర్ వడ్డీ రేట్లను ఓసారి గమనిద్దాం..

  • యాక్సిస్ బ్యాంక్ - 7%
  • HDFC బ్యాంక్ - 7%
  • ICICI బ్యాంక్ - 7%
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ)- 6.5%
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ - 6.5%
  • బ్యాంక్ ఆఫ్ బరోడా - 6.5%
  • కోటక్ మహీంద్రా బ్యాంక్ - 6.2%

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు(National Savings Certificates) :ఎవరైనా డబ్బులను పెట్టుబడిగా పెట్టేముందు.. ఎక్కడ తక్కువ రిస్క్ ఉంటుంటో అక్కడే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అలా తక్కువ రిస్క్ ఉండే వాటిల్లో ఫిక్స్​డ్ డిపాజిట్లు ముందు వరుసలో ఉంటాయి. కానీ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కొన్ని పథకాలు కూడా మంచి రాబడిని అందిస్తున్నాయి. సురక్షితమైనవి కూడా. అలాంటి వాటిల్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC)ఒకటి. ఇందులోనూ బ్యాంకుల ట్యాక్స్ సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు పథకాల మాదిరిగా ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌ ఉంటుంది.

National Savings Certificate Benefits :నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు పన్ను ప్రయోజనాలతోపాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి గాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల NSCపై 7.7 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. అయితే.. ఇందులో చేరాలంటే పోస్ట్ ఆఫీస్‌లో కనీసం రూ.1,000 పొదుపు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంత మెుత్తంలోనైనా ఇందులో డబ్బును ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితులు లేవు.

అంటే ఎంత భారీ మొత్తంలోనైనా ఈ స్కీమ్​లో మనీ ఇన్వెస్ట్ చేయవచ్చన్నమాట. ఎఫ్​డీలో మాత్రం పరిమితి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితులను గమనిస్తే.. కేంద్రం అందించే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో పొదుపు చేయడం ద్వారానే.. ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఎవరు ఎలాంటి సలహా ఇచ్చినా.. అన్నీ ఆలోచించిన తర్వాతే.. లాభ నష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతే ముందుకెళ్లడం పెట్టుబడిదారులకు మంచిది.

FD VS T Bills : ఫిక్స్​డ్​ డిపాజిట్స్ Vs ట్రెజరీ బిల్స్​.. ఏది బెస్ట్​ ఛాయిస్​!

DMF Vs FD.. రెండింటిలో పెట్టుబడికి ఏది బెస్ట్?.. రాబడి ఎందులో ఎక్కువంటే?

ఎక్కువ వడ్డీ వచ్చే ప్రత్యేక FD స్కీమ్స్​ ఇవే.. కొద్ది రోజులే అవకాశం!

ABOUT THE AUTHOR

...view details