First Time House Buying Tips In Telugu :కొత్త ఇల్లు కొనాలనేదిఎంతో మందికి అతిపెద్ద కల. ఉద్యోగం చేసో లేకో వ్యాపారం చేసో ప్రతి రూపాయి కూడబెట్టి సొంతంటి కలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలు కష్టపడేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే సొంతిల్లు కొనాలనే నిర్ణయం అనేది అంత తేలికైనది కాదు. ఇది చాలా డబ్బులతో కూడుకున్న వ్యవహారం. ఒక ఇంటిని కొనుక్కుంటే ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా జీవితంపై భద్రత, స్థిరత్వం కూడా లభిస్తాయి. ఈ నేపథ్యంలో కొత్త ఇంటిని కొనుగోలు చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుందాం..
ఎక్కడ కొంటున్నారు?
House Buying Guide : కొత్త ఇల్లు కొనేటప్పుడు ఏ ప్రాంతంలో తీసుకుంటున్నారనేది ముఖ్యమైన విషయం. నగరంలో అత్యంత మురికిగా ఉన్న ప్రాంతంలో నివసించాలని ఎవరైనా అనుకుంటారా? కాబట్టి ఇల్లు తీసుకునే ప్రాంతం ఆహ్లాదకరంగా ఉందా.. లేదా? అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా.. లేదా? అనేది చూసుకోవాలి.
ఎంత ఈఎంఐ ఉండాలి?
How To Buy Home On EMI :కొత్త ఇల్లు కొనేందుకు చాలా డబ్బులు ఖర్చవుతాయి. రూ.లక్షల్లో డబ్బు అవసరం అవుతుంది. ప్రాంతాన్ని బట్టి ఇళ్ల ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. అయితే మీరు చేసే ఉద్యోగం లేదా వ్యాపారంతో పాటు మీకు నెలవారీ వచ్చే ఆదాయాన్ని బట్టి ఈఎంఐ ఎంత కట్టాలో నిర్ణయించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ముందే చెల్లించి.. ఈఎంఐ తక్కువగా ఉండేలా చేసుకోవచ్చు. నెలవారీగా మీకు వచ్చే ఆదాయంలో 28 శాతం నుంచి 36 శాతం లోపే ఈఎంఐ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అద్దెకు ఉండాలా? ఇల్లు కొనాలా? ఏది బెటర్?
భద్రత ముఖ్యం!
New House Buying Tips : మంచి ఏరియాలో ఇల్లు తీసుకోవడమంటే విలాసవంతమైన ప్రాంతంలో తీసుకోవడమనో లేదా జొమాటో డెలివరీ ఎంత త్వరగా వచ్చే ఏరియాలో తీసుకోవడమనో అర్థం కాదు. మంచి ప్రాంతం అంటే అది ఎంత సురక్షితంగా ఉందని అర్థమని నిపుణులు అంటున్నారు. ఒకవేళ అపార్ట్ మెంట్లో గనుక ఫ్లాట్ తీసుకుంటే అక్కడ ఫైర్ అలారమ్ సిస్టమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సెక్యూరిటీ గార్డులు ఉన్నారా? సీసీటీవీలు బాగా పనిచేస్తున్నాయా? లాంటివి అక్కడ ఉండేవారిని అడిగి తెలుసుకోవాలి.
లాయర్‌ను కలవండి
House Buying Lawyer :కొత్త ఇల్లు లేదా ఫ్లాట్ కొనేముందు ఒక లాయర్‌ను కలవండి. మీరు తీసుకోబోయే ప్రాపర్టీకి సంబంధించి కో-ఓనర్ ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకోండి. ఒకవేళ ఎవరైనా కో-ఓనర్ ఉన్నారని తెలియకపోతే వాళ్లు తర్వాత వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి. అలాగే తీసుకోబోయే ప్రాపర్టీపై ఏవైనా పెండింగ్ లిటిగేషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. బిల్డర్స్ ఎన్విరాన్ మెంటల్ పర్మిట్స్ తీసుకున్నారో లేదో కనుక్కోవాలి. అన్నీ ఓకే అనుకొని కొన్న తర్వాత ప్రాపర్టీ డాక్యమెంట్లను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి.
40 ఏళ్లలోపే 'సొంతింటి' కలను నెరవేర్చుకోవడమెలా?
ఎవరి పేరుపై తీసుకోవాలి?
Tips For First Time Home Buyers :కొత్తగా కొనబోయే ఇంటికి సంబంధించి పేపర్ మీద అన్నీ బాగున్నా యథార్థంలో పరిస్థితులు వేరుగా ఉండొచ్చు. మీరు తీసుకోబోయే ఇంట్లో ఏవైనా రిపేర్లు ఉంటే ఒక ఇంజినీర్ సాయంతో వాటిని సరిచేయించాలి. మీకు నచ్చినట్లు ఇంటీరియర్ లేదా ఇతర పనులు తర్వాత చేయించుకోవచ్చు. మీరు తీసుకోబోయే ఇంటికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా హౌసింగ్ లోన్‌కు అర్హులా.. కాదా? తెలుసుకోండి. లోన్‌కు అర్హులైతే మీరు కొంత డబ్బుల్ని ఆదా చేయొచ్చు. సాధారణంగా గృహ రుణాలకు సంబంధించి మహిళల పేరుపై తీసుకుంటే వడ్డీ రేట్లు చాలా తక్కువగా విధిస్తారు. స్త్రీల పేరుపై ఇంటి లోన్ తీసుకుంటే వడ్డీ మీద రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపులు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.