తెలంగాణ

telangana

ETV Bharat / business

'టాప్ ఉద్యోగిపై 10 నిమిషాల్లో వేటు.. హోదా ఏదైనా ఉద్వాసన తప్పదు'

కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే ఎంతటి వారి పైనైనా సరే చర్యలు తీసుకుంటామని విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ హెచ్చరించారు. ఇటీవల ఓ కీలక వ్యక్తిని కేవలం 10 నిమిషాల్లో తొలగించినట్లు వెల్లడించారు.

fired-senior-employee-in-10-minutes
fired-senior-employee-in-10-minutes

By

Published : Oct 20, 2022, 1:37 PM IST

నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ హెచ్చరించారు. తమ కంపెనీ నియమ నిబంధనల్ని సంస్థలో పనిచేస్తున్న ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని తెలిపారు. లేదంటే వారు ఎంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ చర్యలు తప్పవని హెచ్చరించారు. బెంగళూరులో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మూన్‌లైటింగ్‌కు పాల్పడిన దాదాపు 300 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు విప్రో ఇటీవల వెల్లడించింది. అదే సమయంలో కంపెనీలో అత్యున్నత హోదాలో ఉన్న ఓ వ్యక్తిని సైతం 'నైతిక నిష్ఠను ఉల్లంఘించారని' గుర్తించి వెంటనే తొలగించామని తాజాగా రిషద్‌ వెల్లడించారు. కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తెలిసిన 10 నిమిషాల్లోనే ఆయనకు ఉద్వాసన పలికామని తెలిపారు. సంస్థలో కీలక పదవుల్లో ఉన్న తొలి 20 మంది వ్యక్తుల్లో ఆయనొకరని వెల్లడించారు. అయితే, ఆయన ఎవరు? ఏ హోదాలో ఉన్నారన్నది మాత్రం బహిర్గతం చేయలేదు.

సదరు వ్యక్తి కూడా మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డారా? లేక ఇతర ఏవైనా నిబంధనల్ని ఉల్లంఘించారా? అనే విషయాన్ని సైతం రిషద్‌ వెల్లడించలేదు. మూన్‌లైటింగ్‌ పూర్తిగా నైతిక నిష్ఠను ఉల్లఘించడమే అవుతుందని పేర్కొనడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details