తెలంగాణ

telangana

ETV Bharat / business

Financial Deadlines In September : రూ.2000 నోటు మార్పిడి నుంచి ఫ్రీ ఆధార్ అప్​డేట్ వరకు​.. ఆఖరి గడువు ఇదే! - business news in telugu

Financial Deadlines In September In Telugu : సెప్టెంబర్​ మాసంలో రూ.2000 నోట్ల మార్పిడి నుంచి ఉచిత ఆధార్​ అప్​డేట్ వరకు 7 ముఖ్యమైన ఫైనాన్సియల్ డెడ్​లైన్స్ ముగుస్తున్నాయి. అందుకే గడువు ముగిసే లోపే ఆయా పనులు పూర్తి చేసుకోవడం మంచిది. లేకుండా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

September Financial Deadlines
Financial Deadlines In September

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 5:45 PM IST

Financial Deadlines In September : మీ దగ్గర ఇంకా రూ.2000 నోట్లు ఉన్నాయా? మీ ఆధార్​ను ఉచితంగా అప్​డేట్ చేసుకోవాలా? అయితే ఇది మీ కోసమే. సెప్టెంబర్​ 30లోపు మీరు రూ.2000 నోట్లను బ్యాంకులో మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆధార్​ పోర్టల్​లో సెప్టెంబర్​ నెలాఖరులోపు ఆధార్​ను అప్​డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి సెప్టెంబర్​లో అనేక ఫైనాన్సియల్ డెడ్​లైన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సెప్టెంబర్​లోని 7 ముఖ్యమైన ఫైనాన్సియల్ డెడ్​లైన్స్

  • రూ.2000 నోట్ల మార్పిడికి ఆఖరు తేదీ
    Last Date To Return Rs 2000 Notes :మీ దగ్గర ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకులో మార్పిడి చేసుకునేందుకు ఆఖరు తేదీ సెప్టెంబర్​ 30. అయితే ఈ గడువును మరింత పొడిగించే అవకాశం లేదని లోక్​సభలో ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్​ చౌదరి రాతపూర్వకంగా తెలిపారు. కనుక మీ దగ్గర ఇప్పటికీ రూ.2000 నోట్లు ఉంటే.. కచ్చితంగా వాటిని గడువులోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం మంచిది.

నోట్ : 2023 మే 19న ఆర్​బీఐ రూ.2000 నోట్ల చెలామణిని నిలిపివేసింది. అప్పటి నుంచి ప్రజలు ఈ నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్​ 30 వరకు గడువు ఇచ్చింది.

  • చిన్న పొదుపు ఖాతాలకు ఆధార్​ అనుసంధానం
    Small Savings Scheme Aadhar Link :చిన్న పొదుపు ఖాతాలకు ఆధార్​ నంబర్​ అనుసంధానం చేయాలని ఆర్థికమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇందుకోసం సెప్టెంబర్​ 30 వరకు గడువు ఇచ్చింది. ఒక వేళ ఈ గడువులోగా ఆధార్​ నంబర్​ను అనుసంధానం చేయకపోతే.. అక్టోబర్ 1 నుంచి ఆయా అకౌంట్లను (ఫ్రీజ్)​ నిలిపివేస్తామని స్పష్టం చేసింది. అందుకే పీపీఎఫ్​, సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్​ సేవింగ్స్​ సర్టిఫికేట్​ లాంటి చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతున్నవారు.. కచ్చితంగా తమ ఖాతాలకు సెప్టెంబర్​ 30లోపు ఆధార్​ అనుసంధానం చేసుకోవడం మంచిది.
  • డీమ్యాట్ అకౌంట్​, ట్రేడింగ్ అకౌంట్​కు నామినీ ఏర్పాటు
    Nomination Deadline For Demat And Trading Account : డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఉన్నవారు కచ్చితంగా సెప్టెంబర్​ 30లోపు తమ నామినీ(లబ్ధిదారు)లను ఏర్పాటుచేసుకోవాలని సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్ఛేంజ్​ బోర్డ్​ ఆఫ్ ఇండియా (సెబీ) స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ గడువును చాలా సార్లు పొడిగించడం జరిగింది. ఈ సారి గడువు పొడిగించే అవకాశం తక్కువగా ఉన్నందున.. గడువులోగా మీ డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్​లకు నామినీని యాడ్​ చేసుకోవడం ఉత్తమం.
  • ఉచితంగా ఆధార్​ అప్​డేట్
    Aadhaar Free Update : యూనిక్​ ఐడెంటిఫికేషన్​ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఉచిత ఆధార్​ అప్​డేట్​ గడువును జూన్​ నుంచి సెప్టెంబర్​ 14 వరకు పొడిగించింది. అందుకే ఆధార్ పోర్టల్​లో గడువులోగా ఉచితంగా ఆధార్​ను అప్​డేట్ చేసుకోవడం మంచిది.
  • యాక్సిస్ బ్యాంక్​ మాగ్నస్​ క్రెడిట్ కార్డ్​ వార్షిక రుసుము పెంపు
    Axis Bank Credit Card Fee :యాక్సిస్​ బ్యాంక్​.. తమ ఖాతాదారుల క్రెడిట్​ కార్డు రుసుములను తాజాగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సెప్టెంబర్​ 1 నుంచి ఆన్​బోర్డ్ కస్టమర్ల వార్షిక రుసుమును రూ.10,000+ జీఎస్​టీ నుంచి రూ.12,500+జీఎస్​టీకి పెంచింది. అలాగే ఒక సంవత్సరం వ్యాలిడిటీతో ఇచ్చే రూ.10,000 విలువైన వోచర్లను కూడా నిలిపేసింది. అలాగే సెప్టెంబర్​ 1 నుంచి .. ప్రతి నెలా రూ.1,00,000 కంటే ఎక్కువ ఖర్చు చేసినవారికి ఇచ్చే ఎడ్జ్​ రివార్డ్ పాయింట్లను కూడా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అందుకే యాక్సిస్ క్రెడిట్ కార్డు హోల్డర్లు .. ఈ సరికొత్త రూల్స్​ను రివైజ్​ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
  • ఎస్​బీఐ వీకేర్​ ఎఫ్​డీ గడువు
    SBI WeCare FD For Senior Citizens :ఇది సీనియర్ సిటిజన్స్​ కోసం ప్రత్యేకంగా అందించే స్పెషల్​ ఫిక్స్​డ్ డిపాజిట్​ స్కీమ్​. ఈ ఎస్​బీఐ వీకేర్​ పథకంలో చేరేందుకు ఆఖరు తేదీ సెప్టెంబర్​ 30. ఈ స్కీమ్​లో కొత్తవారు డిపాజిట్స్​ ప్రారంభించవచ్చు. అలాగే ఇప్పటికే స్కీమ్​లో ఉన్నవారు.. దీనిని పునరుద్ధరణ​ కూడా చేసుకోవచ్చు.
  • ఐడీబీఐ అమృత్​ మహోత్సవ్​ ఎఫ్​డీ
    IDBI Amrit Mahotsav FD : ఐడీబీఐ ఈ అమత్​ మహోత్సవ్​ స్పెషల్​ ఫిక్స్​డ్​ డిపాజిట్ స్కీమ్​ ద్వారా ఖాతాదారులకు 7.1 శాతం నుంచి 7.65 శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తోంది. ఈ పథకంలో చేరేందుకు ఆఖరు తేదీ సెప్టెంబర్​ 30. ఈ పథకంలో చేరిన సీనియర్ సిటిజన్లకు.. సాధారణ ఖాతాదారుల కంటే అధిక వడ్డీ లభిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details