తెలంగాణ

telangana

ETV Bharat / business

రాబడి హామీ పాలసీలతో లాభమెంత? - లైఫ్​ ఇన్సూరెన్స్​

Guaranteed Income Plan: పెట్టుబడులతో ఎంతో కొంత నష్టభయం ఉంటుంది. నష్టం ఏమాత్రం భరించలేని వారు.. పథకాలను ఎంపిక చేసుకునేటప్పుడే ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి. మార్కెట్లో దిద్దుబాటు కనిపించినప్పుడు ఆందోళన చెందడం వల్ల ఫలితం ఉండదు. అందుకే, ముందుచూపుతో వ్యవహరించి, కష్టార్జితాన్ని కాపాడుకోవాలి.

రాబడి హామీ.. లాభమెంత?
రాబడి హామీ.. లాభమెంత?

By

Published : Apr 27, 2022, 7:01 PM IST

Guaranteed Income Plan: దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ఈక్విటీల్లో పెట్టుబడులు ఉండాలి. పెట్టుబడిదారుడి వయసు, ఇతర అంశాల ఆధారంగా పెట్టుబడి జాబితాలో ఎంత మొత్తం ఈక్విటీలకు కేటాయించాలనేది నిర్ణయించుకోవాలి. ఇప్పటికే ఈక్విటీల్లో మదుపు చేసిన వారు.. రాబడి హామీనిచ్చే పథకాలను పరిశీలించవచ్చు. తక్కువ నష్టభయం, సురక్షితంగా ఉండాలని కోరుకునే వారికి ఈ పథకాలు అనుకూలంగా ఉంటాయి.

జీవిత బీమా సంస్థలు అందించే ఈ రాబడి హామీ పథకాలు (గ్యారంటీడ్‌ ఇన్‌కం ప్లాన్‌) పాలసీ తీసుకునేటప్పుడే.. నిర్ణీత వ్యవధి తర్వాత ఎంత మొత్తం తిరిగి వస్తుందనే విషయాన్ని తెలియజేస్తాయి. జీవిత బీమా రక్షణతో పాటు హామీతో కూడిన రాబడిని అందుకునే వీలు కల్పిస్తాయి. ఎంత మేరకు రాబడి లభిస్తుందనేది చెల్లించిన ప్రీమియాన్ని బట్టి, ఆధారపడుతుంది. రానున్న రోజుల్లో నెల, మూడు నెలలకోసారి కొంత ఆదాయం వస్తుందనే నమ్మకాన్ని ఈ పాలసీలు పాలసీదారుడికి కల్పిస్తాయి.

మీ ఆదాయానికి అదనంగా కొంత మొత్తం క్రమం తప్పకుండా రావాలని అనుకున్నప్పుడూ ఈ రాబడి హామీ పథకాలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో ఉన్నప్పుడే లేదా పదవీ విరమణ చేసిన తర్వాత ఈ ఆదాయాన్ని అందుకునే ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికోసం..

  • పాలసీ తీసుకున్న వెంటనే ఆదాయం అందుకునే వీలుంటుంది.
  • పరిమిత కాలంపాటు ప్రీమియం చెల్లించి, ఆ తర్వాత ఆదాయాన్ని అందుకోవచ్చు.
  • నిర్ణీత కాలం పూర్తయ్యాక పింఛను లాగా ఆదాయాన్ని అందుకునే పాలసీలను ఎంచుకోచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి, చెల్లింపులు ఎలా ఉండాలన్నది నిర్ణయించుకోవచ్చు.

సులభంగా..మార్కెట్‌ హెచ్చుతగ్గుల వల్ల పెట్టుబడులపై ఎంత రాబడి ఆర్జిస్తామన్నది కచ్చితంగా చెప్పడం కష్టమే. గ్యారంటీడ్‌ ఇన్‌కం ప్లాన్లను ఎంచుకున్నప్పుడు.. మనకు ఏ మేరకు రాబడి వస్తుందనేది ముందుగానే తెలుస్తుంది. దీనివల్ల పెట్టుబడులపై నమ్మకం ఉంటుంది. ఆర్థిక ప్రణాళికను వేసుకోవడమూ దీనివల్ల సులభం అవుతుంది.

- భరత్‌ కల్సి, చీఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆఫీసర్‌, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌

ఇదీ చూడండి :ఎల్​ఐసీ ఐపీఓకు అంతా రెడీ! మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..

ABOUT THE AUTHOR

...view details