Festive Offers 2023 On Harley Davidson Bikes:యువతకు బైక్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ప్రీమియం బైకులపై ఎడతెగని మోజు. ఆ లిస్టులో.. హార్లీ డేవిడ్సన్ బ్రాండ్ కచ్చితంగా ఉంటుంది. ప్రపంచ రోడ్లపై దూసుకెళ్లే.. హై ఎండ్ బైక్ లలో ఇది ముందు వరసలో ఉంటుంది. విశ్వవ్యాప్తంగా గుర్తింపు సాధించిన ఈ బ్రాండ్ ధర కూడా అధికంగానే ఉంటుంది. మరి ఇంత రేంజ్లో ఉన్న ఈ బైక్‌లు ఆఫర్లో లభిస్తే..? అవును మీరు విన్నది నిజమే.. పండుగ సీజన నేపథ్యంలో హార్లీ డేవిడ్సన్ తన కంపెనీకి చెందిన నాలుగు మోడళ్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ తన నాలుగు మోడళ్లపై సుమారు రూ.5.30 లక్షల వరకు గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఈ ఆఫర్లు 2023 మోడల్స్‌కు మాత్రమే చెల్లుతాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
Harley Davidson Pan America 1250 Special (2023):హార్లీ డేవిడ్సన్ Pan America 1250 మోడల్ ప్రస్తుత (ఎక్స్ షోరూమ్) ధర రూ. 24 లక్షల 49 వేలుగా ఉంది. పండుగ ఆఫర్లో ఇది 21 లక్షల 24 వేల రూపాయలకు లభిస్తోంది. అంటే సుమారు 3 లక్షల 25వేల రూపాయలు తగ్గింపు ఉంది.
- ఈ బైక్‌లో 'రివల్యూషన్ మ్యాక్స్' 1252cc సామర్థ్యం కలిగిన లిక్విడ్-కూల్డ్, V-ట్విన్ ఇంజన్ ఉంటుంది.
- దీనిని 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.
- ఈ ఇంజన్ గరిష్ఠంగా 152hp శక్తిని అలాగే 128Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
Harley Davidson Sportster S: హార్లీ డేవిడ్సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ మోడల్ బైక్ ప్రస్తుత (ఎక్స్ షోరూమ్) ధర.. రూ.18 లక్షల 79 వేల రూపాయలు కాగా.. పండుగ ఆఫర్లో ఇది కేవలం 15 లక్షల 54వేలకు అందుబాటులో ఉంది. అంటే సుమారు 3 లక్షల 25వేల రూపాయలు తగ్గింపు ఉంది.
- ఈ బైక్.. కౌంటర్ బ్యాలెన్స్డ్ రివల్యూషన్ మ్యాక్స్ 1250 లిక్విడ్-కూల్డ్ వి-ట్విన్ ఇంజన్‌గా ఉపయోగిస్తుంది.
- ఈ కొత్త స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ లోని 60-డిగ్రీల v-ట్విన్ ఇంజన్.. చిన్న వాల్వ్‌లు, పోర్ట్‌లతో విభిన్నమైన ఇంటర్నల్‌తోపాటు కంబషన్ ఛాంబర్, పిస్టన్ ఆకారాలను కలిగి ఉంటుంది.
- హార్లీ డేవిడ్సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ కోసం రీట్యూన్ చేయబడిన ఈ ఇంజన్‌కి రివల్యూషన్ మ్యాక్స్ 1250 టి అనే పేరు పెట్టారు.
- ఈ ఇంజన్ గరిష్ఠంగా 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 121 బీహెచ్‌పీ శక్తిని, అలాగే 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 125 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- ఈ ఇంజన్ 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.