Festival Offers In October 2023 : దసరా పండుగ సేల్స్.. ఫ్యాషన్ & బ్యూటీ ప్రొడక్టులపై 90%.. స్మార్ట్ఫోన్లపై 80% డిస్కౌంట్స్! - ఫ్లిప్‌కార్ట్ దసరా పండగ ఆఫర్లు
Festival Offers In October 2023 : పండగ సీజన్‌ను పురస్కరించుకొని ఫ్యాషన్, మొబైల్స్, గృహోపకరణాలు సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్‌ను అందించేందుకు రెడీ అయ్యాయి పలు ఇ-కామర్స్ సంస్థలు. వీటిలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా కూడా ఉన్నాయి. మరి ఇవి ఏయే ఉత్పత్తులపై ఏ మేరకు రాయితీలు అందిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా?
Festival Offers In October 2023 :ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా.. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా తమ వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్స్‌ను ప్రకటించాయి. అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ 2023 స్టార్ట్ కానున్నాయి. వీటితో పాటు అక్టోబర్ 7 నుంచి ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా మింత్రా సూపర్ డిస్కౌంట్స్‌తో రెడీ అయ్యింది. అందుకే ఈ సంస్థలు అందిస్తున్న బెస్ట్ ఆఫర్స్, డిస్కౌంట్స్ తదితర వివరాలు ఇప్పుడు తెెలుసుకుందాం.
Amazon Great Indian Festival :అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. అయితే ప్రైమ్ వినియోగదారులు అక్టోబర్ 7 నుంచే ఈ ఆఫర్స్‌ను పొందవచ్చు. ఈనెల చివరి వారం వరకు ఈ డిస్కౌంట్స్ అందుబాటులో ఉండనున్నాయి.
ప్రముఖ కంపెనీల మొబైల్స్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించింది. వీటిలో Samsung S23 Ultra, Lava Agni, Samsung Galaxy S22 Ultra 5G, Motorola Razor 40, Samsung Fold & Flip ఫోన్లు, iPhone 13 ఉన్నాయి.
ఎలక్ట్రానిక్ పరికరాలు (ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఓవెన్లు తదితరాలు), దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్‌లు, ఫుట్‌వేర్, లగేజీ బ్యాగులతో పాటు అనేక రకాల గృహోపకరణాలపై కూడా అమెజాన్ భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటించింది.
Flipkart Big Billion Days : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కూడా అక్టోబర్ 8న ప్రారంభమై, అక్టోబర్ 15 వరకు కొనసాగనుంది. ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ సహా ఇతర ప్రముఖ బ్యాంకుల కార్డులపై వివిధ రకాల ఆఫర్స్‌ను అందుబాటులో ఉంచింది. అలగే ఈఎంఐ ఆప్షన్స్‌తో పాటు, ఎక్స్ట్రా క్యాష్‌బ్యాక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది.
ఎలక్ట్రానిక్ పరికరాలు (స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌వాచెస్, ఫ్రిడ్జ్‌లు, ఇయర్‌బడ్స్, తదితరాలు)పై 50% - 80% వరకు డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్స్ సహా వివిధ టాప్ బ్రాండ్ ఫోన్లపై ప్రత్యేకమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. అవి ఏమిటో ఈ పట్టికలో చూద్దాం. Filpkart Smart Phone Offers And Discounts :
ఫోన్ మోడల్
అసలు ధర
డిస్కౌంట్ తర్వాత ధర
Apple iPhone 14
రూ.69,900/-
రూ.50,000/-
Apple iPhone 14 Plus
రూ.79,900/-
రూ.60,000/-
Samsung Galaxy S22 5G
రూ.85,999/-
రూ.39,999/-
Google Pixel 7a
రూ.43,999/-
రూ.32,999/-
Google Pixel 7 Pro
రూ.84,999/-
రూ.60,999/-
Oppo Reno10 Pro+
రూ.59,999/-
రూ.50,999/-
Oppo Reno 10 5G
రూ.38,999/-
రూ.29,999/-
Vivo T2 Pro 5G
రూ.26,999/-
రూ.21,999/-
Samsung Galaxy F54 5G
రూ.35,999/-
రూ.22,999/-
Motorola Edge 40
రూ.34,999/-
రూ.23,999/-
Samsung Galaxy S21 FE
రూ.69,999/-
రూ.29,999/-
Realme 11 Pro 5G
రూ.25,999/-
రూ.19,999/-
Vivo T2 5G
రూ.23,999/-
రూ.15,999/-
Samsung Galaxy F34 5G
రూ.24,499/-
రూ.14,999/-
Realme 11 5G
రూ.20,999/-
రూ.15,999/-
Moto G84 5G
రూ.22,999/-
రూ.16,999/-
Vivo T2x 5G
రూ.17,999/-
రూ.10,999/-
Samsung Galaxy F14 5G
రూ.17,490/-
రూ.9,999/-
Realme 11x 5G
రూ.16,999/-
రూ.11,999/-
Infinix Note 30 5G
రూ.19,999/-
రూ.12,999/-
Realme C53
రూ.12,999/-
రూ.9,499/-
Redmi 12
రూ.14,999/-
రూ.8,099/-
Poco M6 Pro 5G
రూ.14,999/-
రూ.8,999/-
Infinix Hot 30i
రూ.11,999/-
రూ.6,699/-
Poco C55
రూ.11,999/-
రూ.6,699/-
Infinix Smart 7
రూ.9,999/-
రూ.6,699/-
స్పెషల్ డిస్కౌంట్స్‌తో మింత్రా రెడీ! Myntra Big Fashion Festival :ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ మింత్రా బిగ్ ఫ్యాషన్ పెస్టివల్ సేల్కు సిద్ధమైంది. ఫ్యాషన్ ప్రియులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ సేల్ అక్టోబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా సేల్‌లో ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులపై భారీ ఎత్తున డిస్కౌంట్స్, ఆఫర్స్ అందించనుంది మింత్రా.
మింత్రా బిగ్ ఫ్యాషన్ సేల్‌లో వినియోగదారులు ప్రముఖ బ్రాండ్లపై 30% నుంచి 80% మేర డిస్కౌంట్స్‌ను పొందవచ్చు. వీటిల్లో టెక్స్టైల్స్, వాచెస్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఫ్యాషన్ యాక్సెసరీస్, ఫుట్‌వేర్, కిడ్స్‌వేర్, హ్యాండ్‌బాగ్స్, హోమ్ డెకర్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్‌తో పాటు మరెన్నో ఉత్పత్తులు ఉన్నాయి.