తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫాస్టాగ్​ యూజర్లకు అలర్ట్​- మరో 15 రోజుల్లో ఆ పని చేయకపోతే మీ అకౌంట్ బ్లాక్! - how to update fastag kyc

Fastag KYC Update : ఫాస్టాగ్​ యూజర్లకు అలర్ట్. వాహనదారులు సత్వరమే ఫాస్టాగ్​ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లేదంటే జనవరి 31 తర్వాత ఫాస్టాగ్​లు డీయాక్టివేట్ అవుతాయని తెలిపింది. పూర్తి వివరాలు మీకోసం.

Fastag KYC Update
Fastag KYC Update

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 6:52 PM IST

Fastag KYC Update :టోల్​ ఛార్జీల వసూళ్లను మరింత క్రమబద్ధీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. నో యువర్ కష్టమర్​-కేవైసీ పూర్తి కాని ఫాస్టాగ్​లను నిలుపుదల చేయాలని నిర్ణయించింది. 2024 జనవరి 31లోగా కేవైసీ పూర్తి కాని ఫాస్టాగ్​లను సంబంధిత బ్యాంకులు డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాని తెలిపింది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ- NHAI.

"కొత్త నిబంధనల ప్రకారం కేవైసీ పూర్తి చేయకపోతే ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్‌ ఉన్నా బ్యాంకులు ఈ నెలాఖరు తర్వాత డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయి. అలా అసౌకర్యానికి గురికాకుండా ఉండాలంటే వాహనదారులు సత్వరమే ఫాస్టాగ్​ల కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి" అని ఎన్​హెచ్​ఏఐ స్పష్టం చేసింది. ఈ అంశంపై మరింత సమాచారం కావాలంటే దగ్గర్లోని టోల్​ప్లాజాలు లేదా సంబంధిత బ్యాంకు కస్టమర్ కేర్​ సెంటర్​లను సంప్రదించాలని సూచించింది. ఫాస్టాగ్​లను వాహనానికి అమర్చే విషయాన్ని కూడా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తన ప్రకటనలో ప్రస్తావించింది. కొందరు వాహనదారులు బండి ముందు భాగంలో ఫాస్టాగ్​ను పెట్టకుండా ఇష్టానుసారం చేస్తున్నారని ఎన్​హెచ్​ఐఏ తెలిపింది. ఫలితంగా టోల్​ గేట్​ల దగ్గర ఆలస్యం అవుతోందని, ఇతర ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పింది.

కొందరు వాహనదారులు అనేక వాహనాలకు ఒకే ఫాస్టాగ్​ను ఉపయోగిస్తున్నారని, ఒకే బండికి అనేక ఫాస్టాగ్​లను లింక్ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కేవైసీ పూర్తి కాకపోయినా కొన్ని సందర్భాల్లో ఫాస్టాగ్​ జారీ చేస్తున్నట్లు నిర్ధరించింది. ఇలాంటి వాటిని నివారించేందుకు ఒకే వాహనం- ఒకే ఫాస్టాగ్​ విధానం అమలుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ-ఎన్​హెచ్​ఏఐ చర్యలు చేపట్టింది.

మార్చి నుంచి జీపీఎస్​ విధానంలో టోల్ ఛార్జీలు వసూలు
జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీల వసూలు చేసేందుకు జియో పొజిషనింగ్ సిస్టిమ్​- జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థను తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల వెల్లడించారు. 2024 మార్చినాటికి దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నామని చెప్పారు. తద్వారా ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలుగుతాయని, జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్‌ ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని వివరించారు. జీపీఎస్ విధానం అందుబాటులోకి వస్తే టోల్‌గేట్​ల వద్ద వాహనాలను ఆపాల్సిన పని లేకుండా ఆటోమేటిక్‌ నంబర్‌ప్లేట్‌ రీడర్లను ఏర్పాటు చేస్తున్నామని గడ్కరీ వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే రెండు పైలట్‌ ప్రాజెక్టులు చేపట్టినట్లు చెప్పారు.

ఫాస్టాగ్​ తీసుకో... త్వరగా వెళ్లిపో...!!!

ఫాస్టాగ్ ఉన్నా వడ్డింపులు... రీఛార్జ్ కాక వాహనదారుల అవస్థలు

ABOUT THE AUTHOR

...view details