Banks can Use Face Recognition Iris Scan for Transactions : ఈ రోజుల్లో పెరిగిపోతున్న ఆన్లైన్ బ్యాంక్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. పాస్ వర్డ్ పెడితే.. హ్యాక్ చేస్తున్నారు. ఫిషింగ్ లింక్స్ పంపుతూ.. ఖాతా ఖాళీ చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారుల భద్రతకోసం.. సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు సరికొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఏటీఎంల(Withdraw Money from ATMs) నుంచి డబ్బులు డ్రా చేసుకునే విషయంలో ఈ నూతన విధానం అప్లై చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇంతకీ ఆ నయా సర్వీస్ ఏంటి?
Banks use Face Recognition for Transactions : ఏటీఎంల నుంచి సురక్షితంగా డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఫేస్ రికగ్నిషన్(Face Recognition)ఆప్షన్ వినియోగిస్తే ఎలా ఉంటుందనే విషయమై బ్యాంకులు యోచిస్తున్నాయట. ఇప్పటికే.. ఈ విధానం మనం స్మార్ట్ ఫోన్లలో వినియోగిస్తున్నాం. దీనివల్ల.. మన అనుమతి లేకుండా వేరేవాళ్లు ఎవ్వరూ మన ఫోన్ ఓపెన్ చేయలేరు. ఇదేవిధంగా.. ఏటీఎం బ్యాంకు లావాదేవీలకూ వర్తింపచేయాలని బ్యాంకులు చూస్తున్నాయని తెలుస్తోంది.
Banks can Use Iris Scan for Transactions :ఆర్థిక లావాదేవీల్లో జరిగే మోసాల కట్టడికి ఈ విధానం చాలా బాగా ఉపయోగపడుతుందని బ్యాంకులు యోచిస్తున్నాయి. పన్ను ఎగవేతలను సమర్థవంతంగా గుర్తించేందుకు సైతం ఈ ఫేస్ రికగ్నిషన్, ఐరిస్ స్కాన్ యూజ్ అవుతుందని భావిస్తున్నాయట. ఇప్పటికే ఈ విధానాన్ని ఉపయోగించడానికి.. కొన్ని జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి.
UPI ATM Cash Withdrawal Process : 'యూపీఐ ఏటీఎం'తో.. ఇకపై కార్డ్ లేకుండానే క్యాష్ విత్డ్రా!