Ex SBI Chairman Rajnish Kumar Salary : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. 46.78 కోట్ల మంది కస్టమర్ల బేస్‌తో.. ఏడాదికి రూ.50 లక్షల కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. కానీ ఆ సంస్థ ఛైర్మన్‌కు మాత్రం.. ప్రైవేట్ బ్యాంకు ఛైర్మన్లతో పోలిస్తే చాలా తక్కువ జీతం ఉంటుంది. ఈ విషయంపై ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీశ్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.
ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీశ్ కుమార్..ఇటీవల తన ఆదాయ వివరాలను వెల్లడించారు. తను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా పనిచేస్తున్నప్పుడు తన సంవత్సర ఆదాయం కేవలం రూ.28 లక్షలుగా ఉండేదని స్పష్టం చేశారు. అంటే నెలకు కేవలం రూ.2.33 లక్షలు మాత్రమే జీతంగా అందుకున్నారని పరోక్షంగా వెల్లడించారు. ఇది పూర్తిగా అన్‌ఫెయిర్ అని కూడా ఆయన తన అసంతృప్తి వ్యక్తం చేశారు.
యూట్యూబ్ ఇంటర్వ్యూ!
Ex SBI Chairman Rajnish Kumar YouTube Interview : ఇటీవల మాజీ ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ ఓ యూట్యూబర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తను ఎస్బీఐ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు అందుకున్న జీతభత్యాల వివరాలు వెల్లడించారు. అలాగే ఆ ఇంటర్వ్యూలో బ్యాంకింగ్ సిస్టమ్ గురించి, భారత్‌పే వివాదం సహా అనేక ఇతర అంశాల గురించి వివరించారు.
"రూ.50 లక్షల కోట్ల విలువైన బ్యాంకును నడిపించే ఎస్బీఐ ఛైర్మన్‌కు ఇచ్చే యాన్యువల్ శాలరీ చాలా తక్కువ. ఇది పూర్తిగా అన్‌ఫెయిర్."
- రజనీశ్ కుమార్, ఎస్బీఐ మాజీ ఛైర్మన్
చాలా బెనిఫిట్స్ ఉంటాయ్!
SBI Chairman Salary and Perks : ఎస్బీఐ ఛైర్మన్‌గా ఉన్నవారికి కేవలం జీతం మాత్రమే కాకుండా, ఇంకా అనేక ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తారు. ముఖ్యంగా నివాసం కోసం మంచి విలాసవంతమైన బంగ్లా ఇస్తారు. అంతేకాకుండా ఇతర దేశాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా.. అందుకైన ఖర్చులు చెల్లిస్తారు. అలాగే రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల విలువైన కారును ప్రొవైడ్ చేస్తారు. వీటితో పాటు మెడికల్ ఇన్సూరెన్స్, హాలీడేస్, ఫారిన్ ట్రిప్స్ కూడా ఉంటాయి.
కోట్ల విలువైన బంగ్లా ఇస్తారు!
SBI Chairman Bungalow : ఎస్బీఐ ఛైర్మన్ ఉండేందుకు ముంబయిలోని మలబార్ హిల్స్‌లో ఒక అత్యంత విలాసవంతమైన బంగ్లా ఇస్తారు. ఒక వేళ ఎవరైనా దానిలో నివాసం ఉండాలంటే.. నెలకు కనీసం రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని రజనీశ్ అన్నారు.
ప్రస్తుత ఛైర్మన్ జీతం ఎంత?
SBI Chairman Salary : ప్రస్తుతం ఎస్బీఐ ఛైర్మన్‌గా ఉన్న దినేశ్ కుమార్ ఖారా యాన్యువల్ శాలరీ రూ.37 లక్షలు. అంటే గతేడాదితో పోలిస్తే 7.5 శాతం మేర ఆయన జీతం పెరిగింది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎస్బీఐ ఛైర్మన్ బేసిక్ శాలరీ రూ.27 లక్షలు మాత్రమే. కానీ ఆయనకు రూ.9.99 లక్షల వరకు డియర్నెస్ అలవెన్సులు అందుతాయి.
ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే..
Indian Private Bank Chairman Salary : ఎస్బీఐ బ్యాంకు జీతాలను, ప్రైవేట్ బ్యాంకు జీతాలను పరిశీలిస్తే.. ఎక్కడా వాటికి పోలిక లేదని స్పష్టం అవుతుంది. ప్రస్తుత యాక్సిస్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ అమితాబ్ చౌదరీ యాన్యువల్ శాలరీ రూ.7.62 కోట్లు. భారతదేశంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న బ్యాంకు ఛైర్మన్ ఈయనే. అమితాబ్ చౌదరీ తరువాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ అండ్ సీఈఓ శశిధర్ జగదీశన్ సంవత్సర జీతం రూ.6.51 కోట్లు. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ సందీప్ భక్షి ఏడాదికి రూ.7.08 కోట్లు జీతంగా పుచ్చుకుంటున్నారు.