Evergrande Stock News : హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే షేర్లు ఇవాళ (ఆగస్టు 28) భారీగా పతనం అయ్యాయి. దీనితో ఎవర్‌గ్రాండే తన షేర్ విలువలో దాదాపు 87 శాతం వరకు కోల్పోయిది.
సస్పెన్షన్ తరువాత!
China Evergrande Trading Ban Lifted : ట్రేడింగ్ సస్పెన్షన్ ముగిసిన నేపథ్యంలో దాదాపు 17 నెలల తరువాత ఎవర్‌గ్రాండే గ్రూప్.. హాంకాంగ్ స్టాక్మార్కెట్లో ట్రేడింగ్ మొదలుపెట్టింది. కానీ ఇన్వెస్టర్లు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ షేర్లు వదిలించుకోవడానికే మొగ్గుచూపుతుండడం వల్ల భారీ పతనం దిశగా పయనిస్తోంది.
అప్పుల కుప్ప!
Evergrande Group Debt : ప్రపంచంలోనే అత్యధిక అప్పులున్న రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ ఎవర్‌గ్రాండే. ఈ సంస్థ ఆదివారం 4.5 బిలియన్ డాలర్లు (రూ.37 వేల కోట్ల) నష్టాన్ని ప్రకటించింది. కానీ గతంతో పోలిస్తే తమ నష్టాలు బాగా తగ్గాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఈ ఏడాది తొలి ఆరు మాసాల్లో గతంతో పోలిస్తే 50 % వరకు నష్టాలు తగ్గాయని వెల్లడించింది. అలాగే క్యాష్ ఫ్లో పెంచుకునేందుకు కంపెనీ డైరెక్టర్లు పలు చర్యలు తీసుకొన్నారని ఎవర్‌గ్రాండే గ్రూప్ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంతో పోలిస్తే తమ కంపెనీ ఆదాయం 44 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించింది.
నష్టభయాలు వెంటాడుతున్నాయి!
China Evergrande Debt Crisis : ఎవర్‌గ్రాండే కంపెనీ నష్టాల నుంచి కొలుకుంటున్నామని చెబుతున్నప్పటికీ.. ఆ సంస్థ నగదు నిల్వలు మాత్రం 6.3 శాతం వరకు పడిపోయాయి. ఈ భయంతోనే ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్లను వదిలించుకోవడానికి చూస్తున్నారు.
వాహన విభాగంలోనూ నష్టాలు
Evergrande Group Electric Vehicles Shares :ఎవర్‌గ్రాండే కంపెనీకి ఎలక్ట్రానిక్ వాహన విభాగం కూడా ఉంది. అయితే ఇది కూడా వేరుగా నష్టాలను ప్రకటించింది. దీనితో సోమవారం ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ షేర్లు హాంకాంగ్ స్టాక్మార్కెట్లో 87 శాతం మేర పతనం అయ్యాయి. దీనితో గత మూడు ఏళ్లతో పోల్చి చూస్తే.. తాజాగా ఆ కంపెనీ షేరు విలువ దాదాపు 99 శాతం తగ్గిపోయింది.
రియల్ ఎస్టేట్ సంక్షోభం!
China Real Estate Crisis : చైనాలో రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చిన సంక్షోభానికి ఎవర్‌గ్రాండే కేంద్రంగా నిలిచింది. లక్షల కోట్ల అప్పులు ఆ కంపెనీని చుట్టుముట్టాయి. దీనితో గతేడాది మార్చి నుంచి ఈ కంపెనీ షేర్లను ట్రేడింగ్ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఇటీవలే కంపెనీ షేర్ల ట్రేడింగ్‌కు మరలా అనుమతి లభించింది. దీనితో 17 నెలల తరువాత సోమవారం తిరిగి ట్రేడింగ్‌ను మొదలు పెట్టింది ఎవర్‌గ్రాండే. గత మార్చిలో దీని విలువ 1.65 హాంకాంగ్ డాలర్లు ఉండగా.. నేడు హాంకాంగ్ స్టాక్మార్కెట్లో 0.22 డాలర్ల వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది.
పన్ను తగ్గింపు
China Stock Market Taxes : చైనా, హాంకాంగ్ స్టాక్ మార్కెట్లలో.. షేర్ల ట్రేడింగ్‌పై 0.1 శాతం వరకు పన్ను తగ్గించారు. ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకే ఈ పన్ను తగ్గింపు చర్యలు తీసుకున్నట్లు చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో చైనా, హాంకాంగ్ సూచీలు నేడు మంచి లాభాలతో ట్రేడింగ్ మొదలుపెట్టాయి.