EPFO Alert for Covid Advance Facility :ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO)లో పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్నవారందరికీ ముఖ్య గమనిక. మనీ విత్‌డ్రా అంశానికి సంబంధించి ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న టైమ్‌లో పీఎఫ్ చందాదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు తమ ఫండ్ నుంచి కొంతమేర విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా ఈపీఎఫ్‌ఓ.. 'కొవిడ్ అడ్వాన్స్(Covid advance)' పేరిట సరికొత్త ఫెసిలిటీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. ఆ సదుపాయాన్ని ఈపీఎఫ్‌ఓ నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Covid Advance Facility :2020లో మన దేశంలో కొవిడ్ - 19 విపరీతంగా విజృంభించింది. కనీసం బయటకు వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో.. కొవిడ్ వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఈ క్రమంలో పీఎఫ్ ఖాతాదారులు వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు..తమ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునేలా "కొవిడ్ అడ్వాన్స్" సదుపాయాన్ని ఈపీఎఫ్‌ఓ తీసుకొచ్చింది. అయితే.. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెల్త్ ఎమర్జెన్సీ జాబితా నుంచి కొవిడ్-19ను తప్పించిన నేపథ్యంలో.. ఈ ఫెసిలిటీని నిలిపివేస్తూ ఈపీఎఫ్‌ఓ(EPFO) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
How to Check EPFO Balance: మీ పీఎఫ్ ఖాతాలో ఎంత సొమ్ము ఉందో.. చిటికెలో తెలుసుకోండి!
ఇకపై అలా డబ్బులు రావు :వారం రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిని బట్టి చూస్తే పీఎఫ్ చందాదారులు ఇకపై కొవిడ్ అడ్వాన్స్ పేరిట ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) నుంచి డబ్బులు విత్‌డ్రా చేయడం కుదరదన్నమాట. ప్రస్తుతం ఉమాంగ్ యాప్‌లోకి వెళ్లి కొవిడ్ అడ్వాన్స్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ‘Service not available’ అనే సందేశం కనిపిస్తోంది.
2.2 కోట్ల మంది వినియోగించుకున్నారు : కొవిడ్ - 19 టైమ్‌లో తీసుకొచ్చిన ఈ నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ ఫెసిలిటీ చాలా మందికి ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. అయితే.. ఈ కొవిడ్ అడ్వాన్స్ ఫెసిలటీని ఇంతకాలం కొనసాగించడం కారణంగా చాలామంది రిటైర్‌మెంట్ సేవింగ్స్‌పై ప్రభావం పడిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. 2022-23 ఈపీఎఫ్‌ఓ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2020 మార్చి 28న ఈపీఎఫ్‌ఓ తీసుకొచ్చిన కొవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని.. ఇప్పటివరకు 2.2 కోట్ల మంది వినియోగించుకున్నట్టు సమాచారం. రూ.48 వేల కోట్లను కొవిడ్ అడ్వాన్స్ రూపంలో విత్‌డ్రా చేసుకున్నట్లు ఈపీఎఫ్ వార్షిక నివేదిక ద్వారా తెలుస్తోంది.
EPFO Extends Deadline : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్!.. పెన్షన్ వివరాల అప్లోడ్ గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
PF Interest 2023 : పీఎఫ్ వడ్డీ జమ ప్రక్రియ మొదలైంది.. ఇలా సింపుల్‌గా చెక్ చేసుకోండి!