EPFO Extends Deadline For Higher Pension Option To Employers :అధిక పింఛనుకు సంబంధించి వివరాల అప్లోడ్ చేసేందుకు వేతన జీవులకు ఇచ్చిన గడువును మరికొద్ది రోజుల పాటు పొడగించింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO). మరో మూడు నెలల గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఉద్యోగులకు సూచించింది.
వాస్తవానికి సెప్టెంబర్ 30తో ఈ గడువు ముగియాల్సి ఉంది. కాకపోతే గడువు పెంచాల్సిందిగా ఎంప్లాయర్స్ అసోసియేషన్ నుంచి ఈఫీఎఫ్ఓకు వినతులు వచ్చాయి. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర కార్మిక శాఖ.. గడువు పెంపు నిర్ణయం తీసుకుంది. దీంతో వేతన వివరాలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసేందుకు ఉద్యోగులకు మరింత సమయం లభించింది.
"అధిక పింఛను ఆప్షన్‌కు సంబంధించి పెన్షన్లు/ మెంబర్లకు వేతన వివరాలు అప్లోడ్ చేసేందుకు గడువు ఇవ్వాలని ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ నుంచి మాకు వినతి అందింది. సెప్టెంబర్ 29 నాటికి వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్/ జాయింట్ ఆప్షన్‌కు సంబంధించి ఇప్పటికీ 5.52 లక్షల దరఖాస్తులు ఎంప్లాయర్స్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నాం" అని కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది.