EPFO Subscribers: ఈ ఏడాది సెప్టెంబరులో కొత్తగా 16.82 లక్షల మంది కొత్త చందాదారులు చేరినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) వెల్లడించింది. గతేడాది సెప్టెంబరుతో పోలిస్తే కొత్త చేరికల్లో 9.14 శాతం వృద్ధి నమోదైంది. ఇక ఈపీఎఫ్‌ఓ చట్టం పరిధిలోకి కొత్తగా 2,861 సంస్థలు వచ్చిచేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటుతో పోలిస్తే సెప్టెంబరులో చేరికలు 21.85 శాతం అధికమని ఈపీఎఫ్‌ఓ తెలిపింది. మొత్తం 16.82 లక్షల మంది సభ్యుల్లో .. దాదాపు 9.34 లక్షల మంది మొదటిసారిగా ఈపీఎఫ్‌ఓ పథకంలోకి వచ్చినట్లు పేర్కొంది. ఇందులో 58.75 శాతం మంది 18-25 ఏళ్ల వయసు వారు ఉన్నట్లు వివరించింది.
భారీగా పెరిగిన EPFO చందాదారులు.. దాదాపు 9లక్షల మంది కొత్తగా.. - సెప్టెంబరులో ఈపీఎఫ్‌ఓలో చందాదారులు
ఈ ఏడాది సెప్టెంబరులో కొత్తగా 16.82 మంది చందాదారులు చేరినట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది. గతేడాది సెప్టెంబరుతో పోలిస్తే కొత్త చేరికల్లో 9.14 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. దాదాపు 9.34 లక్షల మంది మొదటిసారిగా ఈపీఎఫ్‌ఓ పథకంలోకి వచ్చినట్లు ప్రకటించింది.
ఇక సెప్టెంబరులో దాదాపు 7.49 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్‌ఓను వీడగా, కొత్త ఉద్యోగాల్లో చేరడంతో మళ్లీ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. వీరు ముందు పీఎఫ్ ఖాతాలోని నగదును కొత్త ఖాతాలోకి బదిలీ చేసుకోవడానికి మొగ్గుచూపారు. సెప్టెంబరులో ఈపీఎఫ్‌ఓలో చేరిన మహిళల సంఖ్య 3.50 లక్షలుగా ఉంది. మొత్తం సంఖ్యతో వీరి వాటా 26.36 శాతం. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 6.98 శాతం ఎక్కువ. కొత్త సభ్యుల చేరిక ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలు ముందుస్థానాల్లో ఉన్నాయి.