EPF Claim Reject Reasons :ఉద్యోగులు నిబంధనలు ఫాలో అవుతూ.. పీఎఫ్ అకౌంట్లో నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు చూపే కారణాలను బట్టి ఎంత శాతం నగదు విత్‌డ్రా చేసుకోవచ్చనేది ఉంటుంది. అయితే.. కొన్ని సార్లు చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మీ ఈపీఎఫ్ క్లెయిమ్ రిజక్ట్ కావొచ్చు. ఆ మిస్టేక్స్ ఏంటి? వాటిని ఎలా సవరించుకోవాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సరైన KYC పత్రాలు సమర్పించకపోవడం : మీ EPF క్లెయిమ్ రిజక్ట్ అవ్వడానికి.. సరైన KYC పత్రాలను సమర్పించకపోవడం ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కేవైసీ వివరాలు అసంపూర్తిగా, ఇన్కరెక్ట్గా ఉన్నా మీ క్లెయిమ్‌ను ఈపీఎఫ్ఓ తిరస్కరిస్తుంది. కాబట్టి.. కేవైపీ ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉండాలి.
UANని ఆధార్‌కి లింక్ చేయకపోవడం : మీరు ఆధార్‌తో ఈపీఎఫ్ఓ UAN లింక్ చేయకపోతే కూడా మీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఈ ప్రక్రియను ముందుగానే పూర్తిచేయాలి.
విత్‌డ్రాయల్ నియమాలు :ఈపీఎఫ్ఓ నుంచి పీఎఫ్ మనీ క్లెయిమ్ చేయాలంటే మీరు కనీసం 6 నెలలపాటు ఉద్యోగం చేసి ఉండాలి. దీంతోపాటు సరైన విత్‌డ్రాయల్ ఫారం ఎంచుకోనప్పుడు కూడా పీఎఫ్ క్లెయిమ్ రిజక్ట్ అవుతుందనే విషయం గుర్తుంచుకోవాలి.
సరైన సమాచారం ఇవ్వకపోయినా :మీరు క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఇచ్చిన సమాచారం.. EPF డేటాబేస్‌లో నమోదు చేసిన వివరాలతో మ్యాచ్ కావాలి. ఏ చిన్న తేడా వచ్చినా.. మీ క్లెయిమ్ రిజక్ట్ అవుతుంది. కాబట్టి.. మీరు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక.. ఓసారి క్రాస్ చెక్ చేసుకోవాలి.
How to Check PF Balance in UMANG App : మీ పీఎఫ్ అకౌంట్లో ఎంత డబ్బుంది..? సింపుల్‌గా చెక్ చేసుకోండి..!
- పుట్టినతేదీ మిస్‌మ్యాచ్ అయితే కూడా ఈపీఎఫ్ఓ క్లెయిమ్ తిరస్కరిస్తుంది. కాబట్టి.. ఆధార్‌లో ఉన్న మాదిరిగా డేట్ ఆఫ్ బర్త్ను ముందే అప్డేట్ చేసుకోవాలి.
- మీ బ్యాంక్ అకౌంట్ వివరాలూ సరిగా ఉండాలి. వీటిల్లో ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంక్ పేరు, బ్రాంచ్ డీటెయిల్స్ సరిపోలాలి.
- బ్యాంకుల విలీనం కారణంగా వాటి పేరు లేదా IFSCలో ఏదైనా మారితే.. క్లెయిమ్ చేయకముందే ఈపీఎఫ్ఓ రికార్డుల్లో వాటిని సవరించుకోవాలి.
- చివరగా మీరు సంస్థలో చేరిన తేదీ.. సంస్థ నుంచి బయటికి వచ్చిన తేదీ వంటి వివరాలు కూడా సరిగా నమోదు చేయాలి. వీటిల్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సదరు సంస్థను సంప్రదించి డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి.
- ఇలా.. వివరాలన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రమే.. పీఎఫ్ క్లెయిమ్ యాక్సెప్ట్ అవుతుంది. లేదంటే.. రిజెక్ట్ కావడం పక్కా.
How Much Money You Can Withdraw from PF : ఉద్యోగంలో ఉండగానే పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు... ఎంత శాతమో తెలుసా?
How to Link Aadhaar with UAN in Online : మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? వెంటనే ఈ పని చేయండి..!