EPF Advance For Marriage : మనకు ఎప్పుడు ఎలాంటి అవసరం ఏర్పడుతుందో చెప్పలేం. ఇలాంటి సందర్భంలో అక్కరకు వచ్చేదే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF). అనుకోని, అత్యవసర ఆర్థిక పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈపీఎఫ్ఓ.. నిబంధనలను అనుసరించి కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇస్తుంది. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ అడ్వాన్స్‌లు నాన్-రిఫండబుల్. కనుక ఈపీఎఫ్ మెంబర్లు తమ అవసరాలకు అనుగుణంగా.. చాలా జాగ్రత్తగా ఈపీఎఫ్ అడ్వాన్స్‌ల కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లై చేయండిలా!
How To Apply For EPF Advance : ఉద్యోగులు ఈపీఎఫ్ అడ్వాన్స్ కోసం.. ఫారమ్ 31ని తమ యజమానికి (కంపెనీ యాజమాన్యానికి) సమర్పించాలి. అప్పుడు మీ కంపెనీ లేదా యాజమాన్యం మీ దరఖాస్తును ధ్రువీకరించి.. ఆమోదం కోసం 'ఈపీఎఫ్ఓ'కు సమర్పించడం జరుగుతుంది. ఈపీఎఫ్ఓ కనుక మీ అభ్యర్థనను ఆమోదిస్తే.. అడ్వాన్స్ సొమ్ము మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
ఏయే అవసరాలకు ఈపీఎఫ్ అడ్వాన్స్ ఇస్తారు?
EPF Advance Reasons :
- ఆరోగ్య అత్యవసర పరిస్థితి (మెడికల్ ఎమర్జెన్సీ)
- విద్య
- వివాహం
- భూమి కొనుగోలు
- గృహాన్ని పునరుద్ధరించడం
- నిరుద్యోగిత
ఉద్యోగుల ఆరోగ్యం బాగాలేనప్పుడు చికిత్స కోసం, విద్య, వివాహం, భూమి కొనుగోలు, గృహ నిర్మాణం లేదా పునరుద్ధరణ కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ ఇస్తారు. ప్రైవేట్ ఉద్యోగులు కొన్ని సార్లు జాబ్ నుంచి తొలగించబడతారు. లేదా వారే స్వయంగా ఉద్యోగాన్ని వదిలేస్తారు. ఇలాంటి సందర్భాల్లో.. సదరు వ్యక్తులు ఈపీఎఫ్ అడ్వాన్స్ పొందడానికి అర్హులు అవుతారు.
వివాహం కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్!
EPF Advance Eligibility : ఉద్యోగులకు ఈపీఎఫ్ మ్యారేజ్ (పెళ్లి) అడ్వాన్స్ కావాలంటే.. సదరు వ్యక్తి ఈపీఎఫ్ఓ మెంబర్‌గా 7 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి.
ఎవరి పెళ్లికి అడ్వాన్స్ ఇస్తారు?
- స్వయంగా ఉద్యోగి వివాహం చేసుకుంటే ఈపీఎఫ్ అడ్వాన్స్ ఇస్తారు.
- ఉద్యోగి కొడుకు లేదా కూతురు పెళ్లి కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు.
- ఉద్యోగి సోదరుడు లేదా సోదరి మ్యారేజ్ కోసం కూడా అడ్వాన్స్ అడగవచ్చు.