తెలంగాణ

telangana

ETV Bharat / business

మొబైల్‌.. కంప్యూటర్‌.. బ్యాంకింగ్‌.. అన్నింటిలోనూ ఉద్యోగ కోతలే.. కారణమేంటి?

మొబైల్‌ ఫోన్లకు గిరాకీ తగ్గడానికి తోడు ప్రభుత్వ తనిఖీలు అధికం కావడం, ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందన్న అంచనాల నేపథ్యంలో, చైనా మొబైల్‌ కంపెనీలు దేశీయంగా వ్యయ నియంత్రణపై దృష్టి సారించాయి. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగ కోతలు ప్రారంభించగా, మొబైల్‌ - కంప్యూటర్‌ తయారీ  సంస్థలు, బ్యాంకింగ్‌ దిగ్గజమూ ఇదే బాట పడుతున్నట్లు ప్రకటించాయి.

companies layoff employees
సంస్థలలో ఉద్యోగ తొలగింపులు

By

Published : Nov 24, 2022, 6:31 AM IST

Updated : Nov 24, 2022, 6:39 AM IST

మొబైల్‌ ఫోన్లకు గిరాకీ తగ్గడానికి తోడు ప్రభుత్వ తనిఖీలు అధికం కావడం, ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందన్న అంచనాల నేపథ్యంలో, చైనా మొబైల్‌ కంపెనీలు దేశీయంగా వ్యయ నియంత్రణపై దృష్టి సారించాయి. ఇందుకోసం ఉద్యోగాల్లో కోతకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కంపెనీల నుంచి స్మార్ట్‌ఫోన్ల సరఫరాలు ఈ ఏడాది స్తబ్దుగా నమోదు కాగా, వచ్చే ఏడాదిలోనూ అదే ధోరణి ఉంటుందనే అంచనాలున్నాయి. 'అందుకే మార్కెటింగ్‌, పంపిణీ విభాగాల్లో నూతన పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీ ఇంకా నిర్ణయం తీసుకోలేద'ని మార్కెట్‌ పరిశోధనా సంస్థ ఐడీసీ ఇండియా ప్రతినిధి తెలిపారు.

లాభదాయకతపై సందేహాల వల్లే..
2022 తరహాలోనే గిరాకీలో స్తబ్దత, నియంత్రణ పరమైన ఒత్తిడి కొనసాగితే లాభదాయకతపై ప్రభావం పడొచ్చని మొబైల్‌ పరిశ్రమ భావిస్తోంది. అందుకే సిబ్బందికి లే ఆఫ్‌లు, స్వచ్ఛంద పదవీ విరమణల దిశగా అవి అడుగులు వేయొచ్చని అంచనా వేస్తున్నారు. దేశీయ స్మార్ట్‌ఫోన్‌ విపణిలో 80 శాతం వాటా చైనా కంపెనీలదే. షియోమీ, ఒపో, వివో వంటి చైనా కంపెనీల కార్యకలాపాలపై ప్రభుత్వ పరిశోధనా సంస్థలు దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే. అక్టోబరు-డిసెంబరుకు స్మార్ట్‌ఫోన్ల సరఫరాలు స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో, 2021తో పోలిస్తే 2022 మొత్తం మీద 8-9 శాతం మేర క్షీణత నమోదు కావొచ్చని ఐడీసీ ఇండియా అంచనా వేసింది.

ఇప్పటికే తొలగింపులు..
అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశీయంగా కొన్ని త్రైమాసికాల్లో పలు చైనా కంపెనీలు 600-800 మంది ఉద్యోగులను తగ్గించాయని తెలుస్తోంది. డేటా రక్షణ విధానాల్లో కఠిన ఆంక్షల నేపథ్యంలో, కొన్ని కంపెనీల నుంచి ఉద్యోగులే తప్పుకుని, వేరే కంపెనీలకు మారుతున్నారని సమాచారం. విక్రయాల విభాగాల్లో ఉన్న ఉన్నతాధికారులు తొలగడం కనిపించింది. గత ఏడాదిన్నర కాలంలో ఈ కంపెనీల సిబ్బందిలో 30% కోత విధించినట్లు చెబుతున్నారు. 2023లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే కొన్నేళ్లలో 20-30 శాతం మేర తొలగింపులుండొచ్చంటున్నారు. మార్కెట్లో అవకాశాలకు అనుగుణంగా సిబ్బంది వలసలూ పెరగవచ్చని అంచనా.

Last Updated : Nov 24, 2022, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details