తెలంగాణ

telangana

ETV Bharat / business

మస్క్ సంపద రోజుకు రూ.2,500 కోట్లు ఆవిరి.. అయినా అగ్రస్థానంలోనే.. - బ్లూమ్‌బెర్గ్‌ వెల్త్‌ ఇండెక్స్‌ ఎలాన్ మస్క్

Elon Musk Wealth : 2022 ప్రారంభం నుంచి ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్​ సంపద రోజుకు రూ.2,500 కోట్ల మేర ఆవిరవుతోంది. ప్రపంచంలోని ఇతర కుబేరుల కంటే మస్క్ సంపదే అధికంగా హరించుకుపోతోంది. అయితే ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన వారి జాబితాలో మస్కే ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నారు.

Elon Musk Wealth Drops
ఎలాన్ మస్క్ సంపద

By

Published : Nov 23, 2022, 7:15 AM IST

Elon Musk Wealth : ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎలాన్‌ మస్క్‌ సంపద విలువ సగటున రోజుకు రూ.2,500 కోట్ల మేర ఆవిరవుతోంది. బ్లూమ్‌బెర్గ్‌ వెల్త్‌ ఇండెక్స్‌ (సంపద సూచీ) జాబితాలోని ఇతర కుబేరుల కంటే మస్క్‌ సంపదే అధికంగా హరించుకుపోతోంది. కొత్తగా కొనుగోలు చేసిన ట్విట్టర్​కు సంబంధించిన సమస్యలు ఆయన్ను వేధిస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన వారి జాబితాలో మస్క్‌దే ఇప్పటికీ అగ్రస్థానం. రెండేళ్లుగా ఆయన విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా షేరు విలువ తగ్గిపోతూ వస్తోంది. ఫలితంగా ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు మస్క్‌ సంపద విలువ 101 బిలియన్‌ డాలర్ల మేర తగ్గింది. ఒక దశలో ఆయన సంపద విలువ 340 బి.డాలర్ల గరిష్ఠస్థాయికి చేరింది. అంటే ఇప్పటికి దాదాపు సగం మేర ఆవిరైంది. న్యూయార్క్‌లో షేర్ల ట్రేడింగ్‌ పూర్తయిన తర్వాత ప్రతి రోజు బ్లూమ్‌బర్గ్‌ వెల్త్‌ ఇండెక్స్‌ గణాంకాలను సవరిస్తుంటుంది.

రెండేళ్ల కనిష్ఠానికి టెస్లా షేరు..
లైట్ల సమస్య కారణంగా అమెరికాలో 3,21,000 టెస్లా కార్లను వెనక్కి పిలిపించడం, ముందు సీటు ఎయిర్‌బ్యాగ్‌లో సమస్యలు సవరించేందుకు మరో 30,000 మోడల్‌ ఎక్స్‌ కార్లను రీకాల్‌ చేయడం వల్లే టెస్లా కంపెనీ షేరు 3 శాతం నష్టపోయి రెండేళ్ల కనిష్ఠానికి చేరింది. గరిష్ఠాల నుంచి కంపెనీ షేరు భారీగా పడటంతో మార్కెట్‌ విలువ సుమారు సగం మేర కోల్పోయింది. ఈ ఏడాది మొత్తం కంపెనీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.

2022 ఆగస్టు నాటికి టెస్లాలో 15 శాతం వాటా మస్క్‌ చేతిలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్విట్టర్​ను 44 బి.డాలర్లతో కొనుగోలు చేసేందుకు ఆయన ఆఫర్‌ ప్రకటించిన సంగతి విదితమే. ఎన్నో ఒడుదొడుకుల మధ్య గత నెలలో ట్విట్టర్​ను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ చేతికి రాగానే ఉద్యోగాల కోతకు దిగారు. మొత్తం 7,000 మంది ఉద్యోగుల్లో సగం మందికి పైగా తొలగించారు. తాజా విడత లేఆఫ్‌లతో కలిపి ట్విట్టర్​లో 60 శాతం ఉద్యోగులకు ఆయన ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details