తెలంగాణ

telangana

ETV Bharat / business

'వేషాలేస్తే ఖాతా తీసేస్తా' ఎలాన్​ మస్క్​ మాస్​ వార్నింగ్ - ఎలాస్​ మస్క్​ పేరడీ ఖాతాలపై వార్నింగ్

Elon Musk Warning : ఎలాన్ మస్క్​ ట్విట్టర్​ పిట్టని సంస్కరణల దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. ఇది వరకే సంస్థలోని సగానికి పైగా ఉద్యోగులను తొలగించిన మస్క్.. తాజాగా ఓ వార్నింగ్ ఇచ్చారు. అలా చేస్తే హెచ్చరికలు లేకుండానే ఖాతాలను తొలగిస్తామని తెలిపారు. ఇంతకీ ఏమన్నారంటే..

elon musk warning on parody as accounts
elon musk warning on parody as accounts

By

Published : Nov 8, 2022, 9:27 AM IST

Elon Musk Warning : ట్విట్టర్ డిస్‌ప్లేలో ఖాతా పేరుకు బదులు వేరొక పేరును వాడితే.. శాశ్వతంగా ట్విట్టర్‌ నుంచి ఆ ఖాతాను తొలగిస్తామని సంస్థ కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ హెచ్చరించారు. కొంత మంది ప్రముఖులు తమ డిస్‌ప్లే పేరును ఎలాన్‌ మస్క్‌గా మార్చి (ఖాతా పేర్లు కాదు).. ట్వీట్లు చేస్తుండడంతో మస్క్‌ ఇలా స్పందించారు. బ్లూటిక్‌ ఖాతాలకు నెలకు 8 డాలర్ల చొప్పున ఫీజు విధించాలని మస్క్‌ నిర్ణయం తీసుకున్నాక, పలువురు సెలబ్రిటీలు తమ ట్విట్టర్‌ హ్యాండిళ్లలో మస్క్‌ ఫొటో, పేరు పెట్టి (వేషాలు మార్చి) నిరసన తెలిపారు. తమ ఖాతా పేర్లను మాత్రం సొంతానివే వాడారు. ఈ నేపథ్యంలోనే 'ఖాతా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు గతంలో ట్విట్టర్‌ హెచ్చరికలు జారీ చేసేది. ఇకపై హెచ్చరికలు ఏమీ ఉండవు. తొలగింపులే' అని మస్క్‌ ట్వీట్‌ చేశారు. 'ఏ ఇతర పేరుకు తమ డిస్‌ప్లేను మార్చినా, ఖాతా ధ్రువీకరణ అయిన బ్లూటిక్‌ను తాత్కాలికంగా కోల్పోతారు' అని తెలిపారు.

భారత్‌లో 90% సిబ్బంది ఇంటికి: ట్విటర్‌ తన భారత ఉద్యోగుల్లో 90% మందికి పైగా తొలగించింది. దీంతో కేవలం డజను మంది సిబ్బంది మాత్రమే మిగిలినట్లు ఈ అంశాలతో సంబంధమున్న వ్యక్తులు పేర్కొన్నారు. 100కు పైగా భాషలున్న భారత్‌లో, తగ్గించిన సిబ్బందితో కంపెనీ కార్యకలాపాలు ఎలా నడుపుతుందో చూడాల్సి ఉంది. 'అవమానం, అనిశ్చితి'.. సంస్థలో ప్రస్తుత పరిస్థితిని తెలపడానికి ఇవే సరైన పదాలని 'ఉద్యోగం ఊడిందంటూ తెలిపే పింక్‌ స్లిప్‌' అందుకున్న ట్విటర్‌ ఇండియా సిబ్బంది ఒకరు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details