Elon Musk Twitter deal: టెస్లా గ్రూప్-ట్విట్టర్ డీల్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. టెస్లా అధినేత, దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ స్వయంగా ఈ విషయం వెల్లడించారు. ట్విట్టర్లో స్పామ్/ఫేక్ ఖాతాలు మొత్తం యూజర్ల సంఖ్యలో 5శాతంకన్నా తక్కువ ఉన్నాయన్న లెక్కలపై మరింత స్పష్టత వచ్చేవరకు ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను హోల్డ్‌లో పెడుతున్నట్లు ట్వీట్ చేశారు.
మరో బాంబు పేల్చిన మస్క్- ట్విట్టర్ డీల్‌కు బ్రేక్! - twitter deal close date
Elon Musk Twitter deal: ట్విట్టర్ కొనుగోలుకు సంబంధించి వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్.. మరో కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్లో ఫేక్ అకౌంట్ల లెక్కపై స్పష్టత వచ్చే వరకు ఈ డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
ట్విట్టర్ డీల్‌పై స్టే ప్రకటనతోపాటు.. ఫేక్ ఖాతాల లెక్కలపై ఓ కథనాన్ని పోస్ట్ చేశారు మస్క్. ప్రస్తుతం సంస్థకు ఉన్న యూజర్లు, వాటిలో ఫేక్ ఖాతాలకు సంబంధించి అమెరికాలోని స్టాక్‌మార్కెట్లకు ట్విట్టర్ సోమవారం సమర్పించిన నివేదికలోని వివరాలు అందులో ఉన్నాయి. "ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 229 మిలియన్ యూజర్లకు యాడ్లు పంపి, ఆదాయం ఆర్జించాం. ఫేక్ లేదా స్పామ్ అకౌంట్ల సంఖ్య.. రోజువారీ యాక్టివ్ యూజర్ల సంఖ్యలో 5శాతంకన్నా తక్కువే ఉంది. మస్క్‌తో డీల్ పూర్తయ్యే వరకు ట్విట్టర్‌కు అనేక సవాళ్లు పొంచి ఉన్నాయి. మా భవిష్యత్ ప్రణాళికలపై అనిశ్చితి దృష్ట్యా అడ్వర్టైజర్లు ట్విట్టర్‌కు ఇంకా యాడ్లు ఇస్తారా లేదా అనే విషయాలపై స్పష్టత లేదు" అని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది ట్విట్టర్.
44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఇటీవలే ఆ సంస్థలో ఒప్పందం చేసుకున్నారు ఎలాన్ మస్క్. భావ ప్రకటనా స్వేచ్ఛకు పెద్ద పీట వేసేలా ఆ సామాజిక మాధ్యమంలో కీలక మార్పులు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు. ముఖ్యంగా.. ట్విట్టర్ నుంచి స్పామ్ బాట్స్‌ను పూర్తిగా నిర్మూలించడం తన ప్రాధాన్యాల్లో ఒకటని ఓసారి ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో స్పామ్/ఫేక్ ఖాతాలపై ట్విట్టర్ లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. డీల్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టారు మస్క్.