Elon Musk Twitter deal: ట్విటర్ కొనుగోలుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన 44 బిలియన్ డాలర్ల ఒప్పందానికి వాటాదార్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో, బోర్డు కూడా ఆమోదించినట్లు మంగళవారం ఎక్స్ఛేంజీలకు ట్విటర్ సమాచారమిచ్చింది. మస్క్ గత వారం ట్విటర్ ఉద్యోగులతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలోనూ కొనుగోలుపై ఆసక్తిని పునరుద్ఘాటించారు. ఆయన ఆఫర్ చేసిన ధర కంటే ట్విటర్ షేరు విలువ ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నందున, కొనుగోలుపై సందేహం ఏర్పడింది.
ట్విట్టర్ 'డీల్'కు బోర్డు ఆమోదం.. 3 శాతం పెరిగిన షేర్ల విలువ
Elon Musk Twitter deal: ట్విట్టర్ కొనుగోలు ఒప్పందానికి వాటాదార్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో బోర్డు కూడా ఈ డీల్‌కు గ్రీన్ సిగ్నల్ చేసింది. మరోవైపు మంగళవారం ట్విట్టర్ షేర్ల విలువ 3 శాతం పెరిగింది.
Elon Musk Twitter deal
తాజా స్పష్టతతో మంగళవారం షేరు ధర సుమారు 3 శాతం పెరిగి 38.98 డాలర్లకు చేరింది. ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేస్తానని ట్విటర్‌కు మస్క్ ఆఫర్ చేశారు. ఏప్రిల్ 5న కంపెనీ స్టాక్ ఈ ధర వద్ద ట్రేడవుతుండేది. ప్రస్తుత షేర్ విలువ కంటే ఇది 15.22 డాలర్లు ఎక్కువగా ఉంది.
ఇదీ చదవండి:
Last Updated : Jun 22, 2022, 9:04 AM IST