ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేరు చెప్పగానే అందరికీ అత్యాధునిక టెక్నాలజీ, టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీతో ఆయన చేస్తున్న ప్రయోగాలే గుర్తొస్తాయి. ఇటీవల ట్విటర్ కొనుగోలు వ్యవహారంతో తరచూ వార్తల్లో నిలుస్తుండడంతో బహుశా ఆ గందరగోళం కూడా జ్ఞప్తికి వచ్చే అవకాశం ఉంది. కానీ, ఆయన ఓ పెర్‌ఫ్యూమ్ సేల్స్‌మన్‌గా మారారని ఊహకు కూడా అందదు కదా! కానీ, ఇది నిజం. ఆయన పెర్‌ఫ్యూమ్ వ్యాపారంలోకి ప్రవేశించారు. 'Burnt Hair' బ్రాండ్ పేరిట ఓ కొత్త రకం పరిమళాన్ని పరిచయం చేశారు. స్వయంగా తానొక 'పెర్‌ఫ్యూమ్ సేల్స్‌మన్'ని అంటూ ట్విటర్ బయోలో పేర్కొనడం గమనార్హం.
ఎలాన్ మస్క్ పెర్‌ఫ్యూమ్ వ్యాపారం.. ఒక్కో బాటిల్ ధర ఎంతో తెలిస్తే షాక్!
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ పెర్‌ఫ్యూమ్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. కొత్త ప్రొడక్ట్‌ను పరిచయం చేస్తూ తానొక పెర్‌ఫ్యూమ్ సేల్స్‌మన్ అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ దీని ధరెంతో తెలుసా?
అత్యాధునిక ప్రయాణ సాంకేతికత, దాని పరిష్కారాల కోసం మస్క్ ఏర్పాటు చేసిన 'బోరింగ్ కంపెనీ' నుంచి ఈ కొత్త పెర్‌ఫ్యూమ్‌ను విడుదల చేశారు. ఈ రంగంలోకి ప్రవేశించడం తనకు అనివార్యమైందని ట్విటర్‌లో ఆయన పేర్కొనడం గమనార్హం. ఇప్పటి వరకు 10,000కు పైగా బాటిళ్లు అమ్ముడైనట్లు తెలిపారు. బోరింగ్ కంపెనీ వెబ్‌సైట్‌లో వీటిని అమ్మకానికి ఉంచారు. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా?.. 100 డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.8,400. క్రిప్టోకరెన్సీ డోజీకాయిన్స్‌తో కూడా దీన్ని కొనుగోలు చేయొచ్చని మస్క్ తెలిపారు.