Elon Musk Twitter: కొద్దిరోజుల కింద ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన టెస్లా అధిపతి ఎలాన్ మస్క్.. మరో సంచలన ట్వీట్‌తో వార్తల్లో నిలిచారు. ప్రభుత్వ, వాణిజ్య వినియోగదారుల నుంచి కొంత మొత్తం సేవా రుసుమును వసూలు చేయాలనుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. అయితే.. సాధారణ వినియోగదారులకు మాత్రం ఎల్లప్పుడూ ఉచితమేనని ప్రకటించారు. ఈ విధానాన్ని అమలు చేస్తే.. యూజర్ల నుంచి ఛార్జీ వసూలు చేసే తొలి పెద్ద సోషల్ మీడియా కంపెనీగా ట్విట్టర్ నిలుస్తుంది.
''ట్విట్టర్ సేవలు.. సామాన్య వినియోగదారులకు ఎల్లప్పుడూ ఉచితమే. కానీ.. కమర్షియల్/ప్రభుత్వ వినియోగదారులకు కొంచెం ఖర్చు కావొచ్చు.''
- ఎలాన్ మస్క్, టెస్లా సీఈఓ
కొద్దిరోజుల కిందట సుమారు 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న మస్క్.. ఇందులో పలు మార్పులు చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆ దిశగా ఇప్పుడు అడుగులు వేశారు. సీఈఓ పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ విజయ గద్దెను కూడా తొలగించనున్నట్లు తెలుస్తోంది. తమ భద్రత గురించి ఉద్యోగులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నాయకులు ఎన్నికల్లో ప్రచారానికి, అభివృద్ధి సంక్షేమాల గురించి ప్రజలకు తెలిసేందుకు ట్విట్టర్‌ను ప్రధాన అస్త్రంగా వాడుతుంటారు. ప్రజలకు చేరువయ్యేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం వాణిజ్య ప్రకటనలకు ట్విట్టర్‌ను ఎంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పోస్ట్‌లు చేయాలంటే రుసుం చెల్లించాల్సిందేనని మస్క్ హింట్ ఇచ్చారు.
ఇవీ చూడండి:పరాగ్‌కు ఉద్వాసన తప్పదా? 'ట్విట్టర్' ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన
ట్విట్టర్‌ను మస్క్ ఏం చేయబోతున్నారు?