తెలంగాణ

telangana

ETV Bharat / business

చైనా కంపెనీకి షాక్.. గ్లోబల్​ వైస్​ ప్రెసిడెంట్​కు ఈడీ నోటీసులు

ED summons Xiaomi: చైనీస్ మొబైల్ కంపెనీ షావోమీకి ఈడీ షాకిచ్చింది. ఆ కంపెనీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్​కు సమన్లు జారీ చేసింది. సంస్థ లావాదేవీలకు సంబంధించిన పలు వివరాలు కోరింది. విదేశీ మారక చట్టం ఉల్లంఘన కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

ED summons Xiaomi
చైనా కంపెనీకి షాక్

By

Published : Apr 13, 2022, 1:25 PM IST

ED summons Xiaomi: చైనా మొబైల్ తయారీ సంస్థ షావోమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్​ మను కుమార్ జైన్​కు ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. విదేశీ మారకపు చట్టం ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఆయనకు నోటీసులు పంపింది. ఈ కేసులో ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. గత కొన్నేళ్లుగా సంస్థ స్వీకరించిన విదేశీ చెల్లింపుల విషయంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులోనే కంపెనీ ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్ అధికారులను విచారిస్తోంది. తాజాగా మను కుమార్​కు బెంగళూరులోని ఈడీ ప్రాంతీయ కార్యాలయం సమన్లు పంపింది.

మను కుమార్ జైన్

xiaomi ED probe: బుధవారం వ్యక్తిగతంగా హాజరు కావాలని లేదా అధికారిక ప్రతినిధిని పంపించాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆదేశించింది. షావోమీ షేర్​హోల్డింగ్స్, కాంట్రాక్టులు సహా నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలు అందించాలని స్పష్టం చేసింది. సంస్థ ఇండియా కార్యాలయానికి వచ్చిన చెల్లింపులు, విదేశాలకు సంస్థ చేసిన చెల్లింపుల లావాదేవీలను పంపాలని తెలిపింది.

xiaomi tax evasion:గతంలో షావోమీ ఇండియా హెడ్​గా మను కుమార్ పనిచేశారు. ఇటీవలే గ్లోబల్ హెడ్ బాధ్యతలు చేపట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో షావోమీ సంస్థ ప్రతినిధి స్పందించారు. తాము భారతీయ చట్టాలను గౌరవిస్తామని స్పష్టం చేశారు. 'మాది బాధ్యతాయుతమైన కంపెనీ. ఇక్కడి చట్టాలకు మేము అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. అన్ని నిబంధనలకు మేం కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తుపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వారికి పూర్తిగా సహకరిస్తున్నాం. అధికారులకు అవసరమైన అన్ని వివరాలను అందించేలా చూస్తున్నాం' అని పేర్కొన్నారు.

అనేక ఆరోపణలు:షావోమీ కంపెనీపై ఇదివరకు పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. ఈ కంపెనీతో పాటు మరికొన్ని చైనా మొబైల్ తయారీ సంస్థలపై ఆదాయ పన్ను శాఖ గతేడాది డిసెంబర్​లో దాడులు చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా షావోమీకి చెందిన కొన్ని స్మార్ట్​ఫోన్ అప్లికేషన్లను కేంద్రం నిషేధించింది. దీంతో పాటు రూ.653 కోట్ల కస్టమ్స్​ సుంకం ఎగవేత ఆరోపణలతో ఆ సంస్థకు కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులు జారీ చేసింది. షావోమీ ఇండియాకు చెందిన ప్రాంగణాల్లో జరిపిన సోదాల్లో.. దిగుమతి సుంకం ఎగవేతకు సంబంధించిన కీలక పత్రాలను డైరెక్టర్ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్​ఐ)​ స్వాధీనం చేసుకుంది. కాగా, ప్రస్తుతం దేశంలోని స్మార్ట్​ఫోన్ మార్కెట్​లో షావోమీ అగ్రస్థానంలో ఉంది. 2021 నాలుగో త్రైమాసికంలో 22 శాతం మార్కెట్ వాటా సంపాదించింది.

ఇదీ చదవండి:'షావోమి' భారీ మోసం.. రూ.653 కోట్ల కస్టమ్స్​ సుంకం ఎగవేత

ABOUT THE AUTHOR

...view details