Early Retirement Plan Benefits :రిటైర్మెంట్ తర్వాత మిగిలిన జీవితాన్ని ఎవరైనా ఆనందంగా గడపాలని కోరుకుంటారు. అయితే ఇందుకు కావాల్సింది ఆ వయసులో మీ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు సరిపడా డబ్బు. ఇందుకోసం పదవీ విరమణ ప్రణాళిక అత్యంత కీలకం. మరి అటువంటి ముఖ్యమైన విషయంలో చాలామంది అలసత్వం వహిస్తూ ఉంటారు. 60 ఏళ్లు దాటిన తరువాత కదా రిటైర్మెంట్ తీసుకోవాల్సింది.. దానికి ఇంకా చాలా సమయం ఉందిలే.. మనకి 50, 55 ఏళ్లు వచ్చాక రిటైర్మెంట్ ప్లాన్‌ను మొదలుపెట్టొచ్చనే భావనలో ఉంటున్నారు. కానీ, ఇది చాలా పెద్ద అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు. 30 నుంచి 35 ఏళ్ల వయసులోనే పదవీ విరమణ ప్లాన్ ( Early Retirement Planning Benefits )ను రెడీ చేసుకుంటే మేలని సూచిస్తున్నారు. చాలా చిన్న వయస్సులోనే పదవీ విరమణ ప్రణాళిక కోసం.. పొదుపు చేస్తే వచ్చే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
20X రూల్‌ను పాటించండి!
Why Plan For Retirement Early :ఈ 20X రూల్ అనేది మీ ఖర్చులకు సరిపడే సొమ్ముకు.. 20 రెట్లు అధికంగా మీ రిటైర్మెంట్ సొమ్ము ఉండాలని సూచిస్తుంది. దీని ప్రకారం రిటైర్మెంట్ తర్వాత మన ఆర్థిక అవసరాలను అంచనా వేయడానికి ఈ 20X రూల్‌ను పాటించండి. ఈ విధానం ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ, అనుకోని పరిస్థితులకు అయ్యే ఖర్చులను ఎదుర్కొనేందుకు దోహదపడుతుంది. ఈ రూల్ సాయంతో మీ సేవింగ్స్‌ను స్టార్ట్ చేయాలి.
ఇన్ని రకాల బెనిఫిట్స్ :
రిటైర్మెంట్ టైమ్‌కు గణనీయమైన పెరుగుదల!
Benefits Of Early Retirement Planning : రిటైర్మెంట్ కోసం ఎంత త్వరగా డబ్బును పొదుపు చేయడం ప్రారంభిస్తే అంత మంచిది. దీని వల్ల దీర్ఘకాలంపాటు మీ పెట్టుబడిని కొనసాగించడానికి వీలవుతుంది. దీనితో మీ పెట్టుబడిపై కాంపౌండింగ్ (చక్రవడ్డీ) ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఫలితంగా పదవీ విరమణ సమయానికి పెద్ద మొత్తంలో మీ చేతికి డబ్బు అందుతుంది.