తెలంగాణ

telangana

ETV Bharat / business

E Pan Download Online : మీ పాన్ కార్డ్​ మిస్ అయ్యిందా?.. ఆన్​లైన్​లో డౌన్​లోడ్​ చేసుకోండిలా..! - ఈ పాన్​ కార్డ్​ డౌన్​లోడ్​

E Pan Download Online : బయటకు వెళ్లినప్పుడు అత్యవసరంగా మీ పాన్​ కార్డ్​ అవసరం పడిందా..? కానీ మీ దగ్గర ఫిజికల్​ పాన్​ కార్డ్​ లేదా..? చింతించకండి ఆన్​లైన్​లో సులువుగా మన ఈ-పాన్​ కార్డ్​ను డౌన్​లోడ్​ చేసి పెట్టుకోవచ్చు. దీంతో మన పనులు సులువుగా జరిగిపోతాయి. మరి ఈ డిజిటల్​ పాన్​ కార్డ్​ను ఆన్​లైన్​లో ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How To Download E Pan Card Online In Telugu
E PAN CARD DOWNLOAD ONLINE BY PAN NUMBER INDIA

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 3:00 PM IST

Updated : Aug 30, 2023, 3:32 PM IST

E Pan Download Online : ప్రస్తుత రోజుల్లో పాన్​ కార్డ్​ లేనివారుండరు. దాదాపు 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరి దగ్గర పాన్ కార్డు కచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకోవాలన్నా.. లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలన్నా పాన్​ కార్డ్​ అనేది తప్పనిసరి ధ్రువపత్రంగా మారిపోయింది. అయితే ఎప్పుడు? ఏ సమయంలో మనకి పాన్​ కార్డ్ అవసరం పడుతుందో చెప్పలేము. ఒక్కోసారి అత్యవసర సమయాల్లో కూడా దీనిని వాడే సందర్భాలు వస్తాయి. అలాంటప్పుడు మన దగ్గర భౌతిక(ఫిజికల్​) పాన్​ కార్డ్ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మన పనులు చకచకా జరిగిపోతాయి. లేకుంటేనే సమస్య వచ్చి పడుతుంది. అప్పుడు మన పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి చిన్న విషయానికే మన ముఖ్యమైన పనులు ఆగిపోనివ్వకుండా చేస్తున్నాయి దేశంలో పాన్​ కార్డ్​లను జారీ చేసే NSDL(నేషనల్​ సెక్యురిటీస్​ డిపాజిటరీ లిమిటెడ్​), UTIITSL(యూటీఐ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ టెక్నాలజీ అండ్​ సర్వీసెస్​ లిమిటెడ్) సంస్థలు.

తమ అధికారిక పోర్టల్​ లేదా వెబ్​సైట్​ నుంచి నేరుగా సదరు వ్యక్తి పాన్​ కార్డ్​ను ఆన్​లైన్​లో( How To Download E Pan Online )నే డౌన్​లోడ్​ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. మనం ఎక్కడికి వెళ్లినా మన ఫోన్​లోనే ఈ ఈ-పాన్​ కార్డ్​ను భద్రపరుచుకోవచ్చు. దీంతో మన పనులు సకాలంలో పూర్తవుతాయి. అయితే మరి ఆన్​లైన్​లో ఈ-పాన్​కార్డ్​ను ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ-పాన్​ కార్డ్​ అంటే..?
What Is E Pan Card :ఈ-పాన్​ కార్డ్​ అనేది మీ భౌతిక పాన్​ కార్డ్​కు ఓ డిజిటల్​ వెర్షన్​. ఫిజికల్​గా మన దగ్గరే ఉంచుకునే బదులుగా దీనిని మొబైల్​ ఫోన్​లోనే భద్రపరుచుకొని మన అవసరాలను తీర్చుకోవచ్చు.

NSDL నుంచి ఆన్​లైన్​లో డౌన్​లోడ్​ ఇలా..!

  • ముందుగా NSDL వెబ్​సైట్​లోకి లాగిన్​ అవ్వండి.
  • 'డౌన్​లోడ్​ ఈ-పాన్​ కార్డ్​' ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • సంస్థ అడిగే వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి. అవి..
  1. PAN నంబర్​
  2. పుట్టిన తేదీ, సంవత్సరం
  • తర్వాత సబ్​మిట్​ బటన్​పై నొక్కండి. దీంతో మీ ఈ-పాన్​ కార్డ్​ జనరేట్​ అవుతుంది.
  • చివరగా దానిని డౌన్​లోడ్​ చేసుకోండి.

వీరు మాత్రమే డౌన్​లోడ్​ చేసుకోవచ్చు..!

  • కొత్తగా PAN కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు లేదా UTIITSL ద్వారా ఇటీవలే కార్డులో కరెక్షన్స్​ చేయించుకున్న వారు మాత్రమే ఈ-పాన్​ కార్డ్​ను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.
  • ఆదాయపు పన్ను శాఖ డేటాబేస్‌లో వ్యక్తికి సంబంధించిన వ్యాలిడ్​ మొబైల్​ నంబర్​తో పాటు రిజిస్టర్డ్​ ఈ-మెయిల్​ వంటి పూర్తి వివరాలు ఉంటేనే ఈ-పాన్​ కార్డ్​ డౌన్​లోడ్​ అవుతుంది.

ఫీజు ఏమైనా చెల్లించాలా..?
E Pan Online Download Charges :ఎటువంటి అనుబంధ ఛార్జీలు లేకుండానే UTIITSL వెబ్‌సైట్‌ ద్వారా ప్రతిఒక్కరూ తమ ఈ-పాన్​ను PDF ఫార్మాట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫ్రీ సర్వీస్​ కేవలం గతనెలలో కొత్తగా పాన్​ కార్డ్​కు దరఖాస్తు చేసుకున్న వారికి లేదా ఇటీవలే పాన్​లో మార్పులు చేయించుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..!

  • ఈ-పాన్​ను డౌన్లోడ్​ చేసుకునేందుకు వినియోగదారుడి రిజిస్టర్డ్​ మొబైల్​ నంబర్​కు ఎస్​ఎంఎస్​ ద్వారా లేదా ఈ-మెయిల్​కు ఓ లింక్​ను పంపిస్తారు. ఇలా వచ్చిన లింక్​ను ఓపెన్​ చేసి ఫోన్​కు లేదా మెయిల్​కు వచ్చిన ఓటీపీని ఎంటర్​ చేసి డిజిటల్​ పాన్​ కార్డ్​ను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.
  • అయితే వినియోగదారుడు మొబైల్ నంబర్, ఈ-మెయిల్​ను ఇప్పటికీ నమోదు చేసుకోనట్లయితే వారు ముందుగా కరెక్షన్స్​కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే ఈ-పాన్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • ప్రతి వినియోగదారుడికి అందించిన లింక్​ ద్వారా ఆన్​లైన్​లో ఈ-పాన్​ను​ డౌన్​లోడ్​ చేసుకునేందుకు గరిష్ఠంగా మూడు అవకాశాలు మాత్రమే కల్పించారు. కాగా, ఈ లింక్​ వ్యాలిడిటీ ఒక నెల వరకు ఉంటుంది.

నోట్​- వినియోగదారుడు ఈ సేవలను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.

Last Updated : Aug 30, 2023, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details