తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆస్ట్రేలియాలో ఆంధ్రా చాయ్​వాలా.. చదువు మానేసి.. టీతో రూ.5 కోట్ల ఆదాయం! - మెల్​బోర్న్​ ఎలిజిబెత్​ స్ట్రీట్ చాయ్‌వాలా

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన ఆ యువకుడు.. ఆస్ట్రేలియాలో ఓ దిగ్గజ యూనివర్సిటీలో బీబీఏ చదివి.. మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో విమానం ఎక్కాడు. కానీ అక్కడకు వెళ్లాక.. తనకు ఉద్యోగం సరికాదనే నిర్ణయానికి వచ్చి, చాయ్‌తో అద్భుతాన్నే చేశాడు. అసలు ఏం చేశాడంటే?

dropout chaiwala elizabeth street melbourne
ఆస్ట్రేలియాలో ఆంధ్రా చాయ్​వాలా

By

Published : Nov 8, 2022, 7:29 AM IST

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరం కాఫీకి ప్రసిద్ధి. ఇపుడు అక్కడ మన నెల్లూరు కుర్రాడి చాయ్‌ అంటే ఆసక్తి చూపే వాళ్లు పెరుగుతున్నారు. ఆ నగరంలో ఎపుడూ రద్దీగా ఉండే సీబీడీ (సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌) ప్రాంతంలోని ఎలిజబెత్‌ స్ట్రీట్‌లో చూస్తే.. భారతీయులు, ఆస్ట్రేలియా వాసులు కలిసి అక్కడి 'డ్రాప్‌అవుట్‌ చాయ్‌వాలా' షాప్‌లో టీ చప్పరిస్తూ.. సమోసా తింటూ కనిపిస్తారు. 'డ్రాప్‌అవుట్‌ చాయ్‌వాలా' పేరు కనిపించగానే చాలా మంది భారతీయులు తప్పనిసరిగా ఆగుతారని ఈ అంకుర సంస్థను స్థాపించిన కొండా సంజిత్‌ (22) చెబుతున్నారు. తమ టీ ఆస్వాదించి, ముందుకు సాగుతారని ఎంతో సంతృప్తితో తెలిపారు. అందుకే ఏడాదిలోనే రూ.5 కోట్ల టర్నోవరు సాధిస్తున్నానని సంజిత్‌ తెలిపారు. అతనేమన్నారంటే..

'ఇక్కడి లా ట్రోబ్‌ యూనివర్సిటీలో బీబీఏ చదవడానికి వచ్చాను. అయితే కోర్సు పూర్తి చేయడంలో విఫలమై, కాలేజీ డ్రాప్‌అవుట్‌గా మారాను. అపుడే సొంత అంకురాన్ని పెట్టాలని అనుకున్నా. చిన్నప్పటి నుంచీ నాకు టీ అంటే ఇష్టం. అందుకే 'డ్రాప్‌అవుట్‌ చాయ్‌వాలా'కు అంకురార్పణ చేశాను. టీ కొట్టు పెడతానన్నపుడు నా తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి లోనైనా, సొంత వ్యాపారం పెడుతున్నానని వారికి నచ్చజెప్పాను. అస్రార్‌ అనే ఒక ప్రవాసుడు నా ప్రాజెక్టుపై నమ్మకం ఉంచి.. ఏంజెల్‌ ఇన్వెస్టర్‌గా మారడానికి ఒప్పుకున్నారు. అలా దీన్ని మొదలుపెట్టాను. వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుంది. మా ఆదాయం పన్నులు పోగా 1 మిలియన్‌ ఆస్ట్రేలియా డాలర్ల (దాదాపు రూ.5.2 కోట్లు)కు చేరనుంది. లాభం 20% దాకా ఉండొచ్చు. ఇక్కడి మన భారతీయులకు 'బాంబే కటింగ్‌' టీ అంటే చాలా ఇష్టం. అలాగే ఆస్ట్రేలియన్లు మన 'మసాలా చాయ్‌', పకోడాలంటే ఆసక్తి చూపుతున్నారు. మేం మెల్‌బోర్న్‌లో రెండో అవుట్‌లెట్‌ తెరవనున్నాం.

ఆలోచన బాగుంటే వ్యాపారం సులువే:మీ ఆలోచనలు బాగుండాలే కానీ.. ఆస్ట్రేలియా అనేది సులువుగా వ్యాపారం చేసుకోవడానికి వీలున్న చోటు. కొత్త వినియోగదార్లను ఆకట్టుకోవడానికి ఫ్యూజన్‌ గ్రీన్‌ టీ, చాయ్‌పిచ్చునో (కాపిచ్చునోకు టీ వర్షన్‌)ను మరింత మెరుగుపరచాల్సి ఉంది. ఇపుడు నా తల్లిదండ్రులు నా విజయంపై గర్వంగా ఉన్నారు. ఇపుడు సోషల్‌ వర్క్‌లో నా డిగ్రీని పూర్తి చేస్తా.'

ABOUT THE AUTHOR

...view details