తెలంగాణ

telangana

ETV Bharat / business

Gas Cylinder Price: మరోసారి వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు.. ఎంతంటే? - గ్యాస్​ సిలిండర్​ ప్రైస్

gas
gas

By

Published : May 19, 2022, 9:12 AM IST

Updated : May 19, 2022, 9:52 AM IST

09:06 May 19

వంటగ్యాస్​ ధర పెంపు

సామాన్యుడిపై గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరుగుదల రూపంలో మరో భారం పడింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. గ్యాస్‌ బండ ధరను రూ.3.50 పెంచారు. అలాగే వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.8 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల భారాన్ని మోస్తున్న సామన్యులపై తాజా పెరుగుదలతో మరింత భారం పడనుంది.

ఈనెలలో గ్యాస్​ ధరలు పెరగడం ఇది రెండోసారి. మే 7న సిలిండర్​పై రూ.50 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకన్నాయి. అంతకుముందు మార్చి 22న కూడా 50 రూపాయలు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. తాజా నిర్ణయంతో సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్​పీజీ సిలిండర్​ ధర రూ. 1003కు చేరింది.

ఇదీ చూడండి :త్వరలో ఎయిర్​టెల్ ఛార్జీల మోత.. 'టార్గెట్ రూ.200'!

Last Updated : May 19, 2022, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details