Dlf Flats In Gurgaon :ఈ మధ్య కాలంలో ఇళ్లను కొనుగోలుచేసేవారి అభిరుచులు మారిపోతున్నాయి. కేవలం నివాసం మాత్రమే అని చూడకుండా ఇంట్లో సకల సౌకర్యాలు, అధునాతన హంగులు ఉండాలని కోరుకుంటున్నారు. ఆర్థిక స్తోమత ఉన్న వ్యక్తులు అయితే లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా విలాసవంతమైన గృహాలకు భారీగా గిరాకీ పెరుగుతోంది. దీంతో తాజాగా రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్ (DLF)కు చెందిన ఓ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు ప్రీ-లాంచ్‌లో ఊహించని డిమాండ్ దక్కింది. కేవలం 72 గంటల్లోనే రూ.7,200 కోట్ల విలువైన 1,113 ఫ్లాట్లు అమ్ముడయ్యాయి.
ఈ విషయాన్ని డీఎల్‌ఎఫ్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది. గురుగ్రామ్‌లోని 76, 77 సెక్టార్లలో కొత్తగా నిర్మించబోయే డీఎల్‌ఎఫ్ ప్రివానా సౌత్ లగ్జరీ రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు ఇటీవల ప్రీ-లాంచ్ నిర్వహించింది. దీంట్లో నిర్మాణానికి ముందే ఫ్లాట్లన్నీ అమ్ముడైనట్లు కంపెనీ పేర్కొంది. కేవలం మూడు రోజుల్లోనే కస్టమర్లు వీటిని బుక్ చేసుకున్నట్లు తెలిపింది.
మొత్తంగా 25 ఎకరాల్లో ఈ అపార్ట్‌మెంట్లను నిర్మించనున్నట్లు సంస్థ తెలిపింది. 7 టవర్లలో 1,113 విలాసవంతమైన నివాసాలను నిర్మించనున్నారు. ఈ ఫ్లాట్‌కు బుకింగ్ ధర రూ.50లక్షలుగా నిర్ణయించారు. ఒక్కో కొనుగోలుదారు ఒక ఫ్లాట్‌ను మాత్రమే బుక్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇళ్లను కొనుగోలు చేసిన వారిలో 25శాతం మంది NRIలేనని కంపెనీ వివరించింది.
3 రోజుల్లోనే 1100 ఇళ్లు సేల్!
అంతకుముందు గతేడాది మార్చిలోనూ డీఎల్‌ఎఫ్ సంస్థ ఇలానే లగ్జరీ అపార్ట్‌మెంట్లకు ప్రీ-లాంచ్ నిర్వహించగా ఫ్లాట్లు హాక్ కేకుల్లా అమ్ముడుపోయాయి. వీటిని కొనేందుకు ప్రజలు విపరీతంగా పోటీపడ్డారు. గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ ఆఫీస్ ముందు బారులు తీరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్లాట్లు కొనేందుకు ఎగబడ్డారు. డీఎల్‌ఎఫ్ సంస్థ కొత్తగా ప్రారంభించిన విలాసవంతమైన ప్రాజెక్ట్‌లో ఫ్లాట్ల కోసం జనం ఇలా పోటీపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. అప్పుడు కూడా కేవలం మూడు రోజుల్లోనే రూ.8000 కోట్లకు పైగా విలువైన 1,137 ఫ్లాట్లను అమ్మింది. వీటిలో ఒక్కో ఇంటి ధర రూ.7కోట్లకు పైమాటే! పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి