Diwali Festival Offers On Cars 2023 : భారతదేశంలో ఎక్కువగా.. పండుగ సీజన్‌లోనే ఆటోమొబైల్‌విక్రయాలు భారీగా జరుగుతుంటాయి. ప్రత్యేకించి దీపావళి పండగ సమయంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు.. జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కార్ల తయారీ సంస్థలు కూడా.. భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. లగ్జరీ కార్లను తయారు చేసే వోల్వో సంస్థ.. ఈ దివాళీకి భారీ ఆఫర్లను ప్రకటించింది. ఒక కారుపై ఏకంగా రూ.7 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఆ వివరాలు చూద్దాం.
వోల్వో XC40 రీఛార్జ్ (Volvo XC40 Recharge) :
వోల్వో సంస్థ.. XC40 రీఛార్జ్ కారుపై తగ్గింపును ప్రకటించింది. రూ.1,78,500 తగ్గిస్తున్నట్టు చెప్పింది. దీంతోపాటు 3 సంవత్సరాలు వోల్వో కారు సర్వీస్ ప్లాన్, 4 సంవత్సరాల డిజిటల్ సేవలు, 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, 11kW వాల్ బాక్స్ ఛార్జర్‌ను అందిస్తోంది. గతంలో వోల్వో XC40 రీఛార్జ్ ధర దాదాపు రూ.56.90 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉండేది. ప్రస్తుతం దీపావళి ఆఫర్‌లో భాగంగా ఈ కారును రూ.55.12 లక్షల (ఎక్స్ షోరూం)కు కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.
కారులో ఉండే ముఖ్యమైన ఫీచర్స్..
- కాంపాక్ట్ మాడ్యులార్ ఆర్కిటెక్చర్ (CMA) ప్లాట్‌ఫామ్‌పై.. వోల్వో ఎక్స్‌సీ40 రీఛార్జ్ కారును తయారు చేశారు.
- వోల్వో XC40 రెండు విద్యుత్ మోటార్లతో నడుస్తుంది.
- 660 ఎన్‌ఎం టార్క్ వద్ద 402 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
- కేవలం 4.9 సెకన్లలో 0-100 KM/hour వేగాన్ని అందుకుంటుంది.
- గరిష్ఠ వేగం 180 KM/hour పరిమితం చేశారు.
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 418 కి.మీ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.
- 150 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 40 నిమిషాల్లోనే 0-80 శాతం ఛార్జ్ అవుతుందని సంస్థ పేర్కొంది.
- సాధారణ 11కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌తో అయితే.. పూర్తిగా ఛార్జ్ కావడానికి ఎనిమిది గంటలు పడుతుందని వెల్లడించింది.
దీపావళి కార్ ఆఫర్స్ - ఆ మోడల్‌పై ఏకంగా రూ.3.5 లక్షల డిస్కౌంట్!