Diwali Car Discount 2023 : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు మహీంద్రా, సుజుకీ, జీప్, సిట్రోయెన్, స్కోడా ఈ దీపావళి సందర్భంగా తమ లేటెస్ట్ మోడల్ కార్లపై భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటించాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Diwali Offers On Mahindra Cars :ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్ర.. ఈ దీపావళి పండుగ సందర్భంగా ఆ కంపెనీ కార్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.
Mahindra Bolero Neo Diwali Offer :మహీంద్రా బొలెరో కారుపై భారీ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ప్రకటించింది సంస్థ. మహీంద్రా TUV300 మోడల్ కారును కంపెనీ రీబ్రాండ్ చేసి బొలెరో నియోగా (Mahindra Bolero Neo) మార్చింది. ఈ కారులో ఒరిజినల్ బొలెరో కారు కన్నా మరిన్న ఫీచర్లను పొందుపర్చారు. 1.5 లీటర్ త్రీ సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు.. 100hp పవర్, 260Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ దీపావళికి ఈ సెవెన్ సీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన వారికి భారీ డిస్కౌంట్స్‌తో అందిస్తున్నారు. మహీంద్రా డీవల్స్.. బొలెరో నియో కారు కొనుగోలు చేసినవారికి రూ.50,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తారు.
Mahindra Bolero Diwali Offer :మహీంద్రా కంపెనీలో 'వర్క్‌హార్స్'గా పిలిచే మరో వాహనం మహీంద్రా బొలెరో. 2000వ సంవత్సరంలో కంపెనీ ఈ కారును లాంచ్ చేసింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఈ కారు సేల్స్‌లో దూసుకెళ్తోంది. ఈ మధ్య కాలంలో ఈ మోడల్లో చాలా ఫేస్‌లిఫ్ట్ తీసుకువచ్చారు. ఇక కొత్త భద్రత నింబధనల ప్రకారం ఈ కారులో 1.5 లీటర్ త్రీ సిలిండర్ mHawk డీజిల్ ఇండిన్ను పొందుపర్చారు. 76hp పవర్‌ను ఉత్పత్తి చేసే ఈ వర్క్హార్స్పై.. దిపావళి సందర్భంగా రూ.70,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నారు.
Mahindra XUV300 Diwali Offer : మహీంద్రా టాటా నెక్సాన్‌కు పోటీగా XUV300ను లాంచ్ చేసింది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ 110hp పెట్రోల్, 130hp పెట్రోల్, 117hp డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందులోబాటులో ఉంది. ఈ కారును కొనుగోలు చేసిన వారికి రూ.1,20,000 వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
Mahindra XUV400 Diwali Offer : మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈ కారును కొనుగోలు చేసిన వారికి రూ.3,50,000 వరకు బినిఫిట్స్ అందిస్తున్నారు.
Maruti Suzuki Jimny Zeta Diwali Offer : దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తమ కార్లపై దిపావళి ఆఫర్స్ ప్రకటించింది. అందులో ముఖ్యంగా కంపెనీ టాప్ అడ్వెంచర్ కారు జిమ్మీ జెటాపై భారీ ఆఫర్స్ ప్రకటించింది. 1.5-లీటర్ K15B పవర్ఫుల్ పెట్రోల్ ఇంజిన్‌తో జిమ్మి జెటాని అందుబాటులోకి తెచ్చారు. స్టీల్ వీల్స్‌తో వస్తున్న జిమ్మి జెటాలో.. 7.0 టచ్ స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఆరు ఎయిర్ బ్యాగ్‌లు ఈఎస్పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రొగ్రామ్) ఉన్నాయి.