తెలంగాణ

telangana

ETV Bharat / business

ఉద్యోగులకు డిస్నీ భారీ షాక్.. 7వేల మంది లేఆఫ్

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ప్రముఖ కంపెనీలు ఈ దిశగా అడుగులు వేయగా.. తాజాగా డిస్నీ కూడా ఉద్యోగుల తొలగింపునకు ఉపక్రమించింది. సంస్థలో పనిచేస్తున్న ఏడు వేల మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది.

disney-layoffs-7000-employees-in-2023
డెల్ సంస్థలో ఉద్యోగుల తొలగింపు

By

Published : Feb 9, 2023, 12:52 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. తాజాగా డిస్నీ ఏడు వేల మంది ఉద్యోగులకు కంపెనీ నుంచి ఉద్వాసన పలుకనున్నట్లు తెలిపింది. 5.5 బిలియన్‌ డాలర్ల ఖర్చులను ఆదా చేయడంలో భాగంగా ఇలా చేస్తున్నట్లు డిస్నీ సీఈఓ బాబ్‌ ఇగర్‌ వెల్లడించారు. కంపెనీలో మొత్తం 2 లక్షల 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా... వారిలో 3 శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల డిస్నీ ప్లస్ వినియోగదారులు ఒక శాతం తగ్గి 168.1 మిలియన్‌కు పడిపోయారు. నష్టాలు పెరిగిపోతుండటం వల్ల ఇప్పటికే కొత్త నియామకాలు నిలిపివేసిన డిస్నీ.. పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

"ఈ రోజు సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ఈ నిర్ణయం చాలా అవసరం. అయినా నేను ఈ నిర్ణయాన్ని అంత తేలికగా తీసుకోను. ప్రపంచవాప్తంగా ఉన్న మా ఉద్యోగుల ప్రతిభ, అంకితభావం పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది." అని డిస్నీ సీఈఓ బాబ్‌ ఇగర్‌ తెలిపారు. కరోనా మహమ్మారితో సంస్థ నష్టాలను చవిచూసిందన్న ఇగర్‌.. ఆ సమయంలో షేర్​ హోల్డర్లకు డివిడెండ్​ చెల్లించలేకపోయామన్నారు. సంస్థ తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు ఇగర్​ వెల్లడించారు.

డెల్ ఉద్యోగులకూ షాక్..​
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో డెల్ సంస్థ కూడా ఈ మధ్యే ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ అయినా డెల్ టెక్నాలజీస్​.. 6,650 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కొద్ది రోజులు క్రితం ప్రకటించింది. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 5శాతంమని కంపెనీ కో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ క్లార్క్‌ వెల్లడించారు. ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ఇన్ఫోసిస్​లోనూ..
సాఫ్ట్​వేర్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్​ కూడా కొద్ది రోజుల క్రితం 600 ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. కంపెనీ నిర్వహించిన ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ) పరీక్షలో ఫెయిలయినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్వాసనకు గురైన వారిలో ఎక్కువ మంది 2022 జులైలో నియమితులైనవారేనని పేర్కొంది. ఉద్వాసనకు గురైన 600 మందిలో 280 మందిని రెండు వారాల క్రితం తొలగింపునకు గురైనట్లు వెల్లడించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ఫిలిప్స్​లోనూ..
ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫిలిప్స్ కూడా ఉద్యోగుల తొలగింపు దిశగా అడుగులు వేసింది. ఆర్థిక నష్టాల కారణంగా ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ఫిలిప్స్‌ తెలిపింది. మూడు నెలల క్రితమే ఆ సంస్థ 4 వేల మంది ఉద్యోగులను తొలగించగా.. తాజాగా 6 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details