తెలంగాణ

telangana

ETV Bharat / business

BHIM - UPI మధ్య తేడాలేంటి? ఏది వాడితే బెటర్?

Difference Between BHIM and UPI : ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆన్​లైన్ చెల్లింపులు చేస్తున్నారు. అయితే.. చాలా మందికి BHIM, UPI మధ్య తేడా తెలియదు. కొందరైతే.. అవి రెండూ ఒకటే అనుకుంటారు. కానీ.. ఇవి రెండు వేర్వేరు. ఈ రెండు యాప్​ల మధ్య కొన్ని ప్రధానమైన తేడాలు ఉన్నాయి. ప్రయోజనాలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Difference Between BHIM and UPI
Difference Between BHIM and UPI

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 10:58 AM IST

Updated : Nov 5, 2023, 4:19 PM IST

Difference Between BHIM and UPI :ఈ టెక్ యుగంలో నగదు లావాదేవీలన్నీ ఆన్​లైన్​లోనే జరిగిపోతున్నాయి. అయితే.. మనం నిత్యం ఉపయోగించే ఆన్​లైన్ చెల్లింపు మోడ్​లలో ఒకటి.. BHIM (భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ), మరొకటి UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్). చాలా మందికి ఈ రెండిటి మధ్య తేడా తెలియదు. ఇంతకీ.. వీటి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటి? ఇవి ఎలా పని చేస్తాయి? వీటి ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

What is BHIM :నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)"భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ(BHIM) " పేరుతో ఒక యాప్​ను రూపొందించింది. ఇది డిజిటల్‌ చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి, దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. BHIM అనేది UPI ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. సురక్షితమైన, అనుకూలమైన లావాదేవీలను నిర్వహించడానికి యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.

భీమ్ ఫీచర్స్ (BHIM Key Features in Telugu) :

  • కొత్త వ్యక్తులు కూడా ఈజీగా ఉపయోగించేలా BHIM ఇంటర్ ఫేస్ ఉంటుంది.
  • BHIM అనేది బహుళ భాషలకు సపోర్ట్ చేస్తుంది.
  • ఇది భారతదేశం అంతటా విభిన్న వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
  • BHIM యాప్ అనేది.. ఇటు Android, అటు iOS రెండు ప్లాట్‌ఫారమ్‌లలోనూ అందుబాటులో ఉంది.
  • BHIM ద్వారా.. మొబైల్ నంబర్‌, UPI ID, QR కోడ్‌.. ఇలా దేనికైనా చెల్లింపులు చేయవచ్చు.
  • తద్వారా ట్రాన్సాక్షన్స్​ ప్రక్రియ సులభతరం అవుతుంది.

భీమ్ ప్రయోజనాలు (BHIM Benefits) :

  • వినియోగదారుల వ్యక్తిగత, ఆర్థిక సమాచార భద్రతకు భరోసానిస్తుంది.
  • NPCI నిర్దేశించిన భద్రతా ప్రమాణాలకు BHIM కట్టుబడి ఉంటుంది.
  • BHIM వినియోగదారులను రియల్​ టైమ్​ లావాదేవీలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.
  • స్పాట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్​ యాక్సెప్ట్ చేస్తుంది.
  • BHIM వివిధ రంగాల్లో వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్స్​ ద్వారా విస్తృతంగా ఆమోదించబడింది.
  • ఇది వినియోగదారులకు అనుకూలమైన పేమెంట్ ఆప్షన్​గా మారింది.

How to be Safe from UPI Frauds: యూపీఐ మోసం.. తేడావస్తే అంతే.. ఇలా రక్షించుకోండి!

యూపీఐ అంటే ఏంటి (What is UPI) :

UPI అనేది వివిధ బ్యాంక్ ఖాతాల మధ్య.. ట్రాన్సాక్షన్స్​ జరిపే వ్యవస్థ. దీన్ని కూడా NPCI అభివృద్ధి చేసింది. UPI అనేది.. వ్యక్తులు, వ్యాపారాలు, సంస్థల మధ్య డిజిటల్‌ చెల్లింపులు జరపడానికి ఉపయోగించవచ్చు.

UPI ఫీచర్స్ :

  • UPI అనేది యాప్స్​ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి.. ఒక్కో యాప్​లో ఒక్కో విధమైన ఇంటర్​ ఫేస్ ఉండొచ్చు. అయితే.. అవన్నీ యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటాయి.
  • వినియోగదారులు ఒకే UPI IDకి ఒకటికన్నా ఎక్కువ బ్యాంక్ ఖాతాలను లింక్ చేయవచ్చు.
  • ఈ విధానం వల్ల వివిధ ఖాతాల వివరాలన్నీ గుర్తుంచుకోవలసిన అవసరం తప్పుతుంది.
  • UPI 24 గంటలూ పనిచేస్తుంది.
  • బ్యాంక్ టైమింగ్స్​తో సంబంధం లేకుండా.. ఎప్పుడైనా, ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్​ చేయొచ్చు.
  • వ్యక్తి నుంచి వ్యక్తికి చెల్లింపులు, బిల్లుల చెల్లింపులు, బిజినెస్ చెల్లింపులు వంటి వివిధ ట్రాన్సాక్షన్స్​ ఆప్షన్స్​ను UPI అందిస్తుంది.

UPI ప్రయోజనాలు :

  • ఒకే UPI IDకి ఒకటికన్నా ఎక్కువ బ్యాంక్ ఖాతాలను లింక్ చేయవచ్చు.
  • దీనివల్ల మనీ ట్రాన్సాక్షన్​ బ్యాంక్ నుంచి బ్యాంక్​కు ఈజీగా జరిగిపోతుంది.
  • UPI వినియోగదారులకు వెంటనే పేమెంట్ నోటిఫికేషన్‌లను పంపుతుంది.
  • సేవలు పారదర్శకంగా ఉంటాయి.

UPI Credit Line Facility : అకౌంట్​లో డబ్బులు లేకపోయినా UPI పేమెంట్స్.. ఎలాగంటే?

BHIM, UPI మధ్య ప్రధాన తేడాలివే..

  • BHIM అనేది ఒక స్వతంత్ర చెల్లింపు యాప్‌. UPI అనేది అనేక యాప్‌లకోసం పనిచేసే సాధనం.
  • BHIM ఒకే డిజైన్‌ ఇంటర్‌ఫేస్‌ కలిగి ఉంటుంది. వినియోగదారులను నావిగేట్, ట్రాన్సాక్షన్స్​ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. దీనివల్ల BHIM వాడుతున్న వారందరికీ ఇంటర్​ ఫేస్​ మీద స్పష్టమైన క్లారిటీ ఉంటుంది.
  • UPI అనేది వివిధ రకాల యాప్​లలో పనిచేస్తుంది. ఒక్కో యాప్ ఒక్కో విధమైన ఇంటర్​ఫేస్​ను కలిగి ఉంటుంది. వినియోగదారులను నావిగేట్ చేయడం.. ట్రాన్సాక్షన్స్​ చేయడం.. ఒక్కో యాప్​లో ఒక్కో విధంగా ఉండొచ్చు.
  • BHIM, UPI రెండూ.. ట్రాన్సాక్షన్స్​ సులభతరం చేస్తున్నప్పటికీ.. BHIM ప్రధానంగా వ్యక్తుల మధ్య చెల్లింపులపై దృష్టి సారిస్తుంది. UPI మాత్రం.. వ్యక్తిగత చెల్లింపులతోపాటు బిల్ పేమెంట్స్, వ్యాపార లావాదేవీలు వంటి విస్తృత శ్రేణిని కలిగి ఉంటుంది.
  • BHIM, UPIలలో ప్రతీ వ్యక్తిగత లావాదేవీకి రూ.1 లక్ష పరిమితి ఉంటుంది. కానీ.. UPIలో బిల్ పేమెంట్స్, వ్యాపార లావాదేవీలకు మాత్రం గరిష్ఠంగా రూ.5 లక్షల పరిమితి వర్తిస్తుంది.
  • BHIM దేశంలోని బహుళ భాషలకు సపోర్ట్ చేస్తుంది. UPI అనేది ఆయా యాప్స్​ స్థాయిని బట్టి వేర్వేరు భాషలకు సపోర్ట్ చేయవచ్చు.
  • ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనే ప్రశ్న వచ్చినప్పుడు.. రెండిటి మధ్య తేడాలను గమనించి.. వ్యక్తులు తమ అవసరానికి అనుగుణంగా ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

How To Reverse UPI Transaction : యూపీఐ ద్వారా రాంగ్​ నంబర్​కు పేమెంట్​ చేశారా?.. వెనక్కు తీసుకోండిలా!

WhatsApp Pay How to Send and Receive Money Online : వాట్సాప్​లో డబ్బులు పంపొచ్చు.. ఈ విషయం మీకు తెలుసా.!

Last Updated : Nov 5, 2023, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details