తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 12:03 PM IST

ETV Bharat / business

Currency Notes with Scribblings are not Invalid? : కరెన్సీ నోట్లపై పెన్నుతో రాస్తే.. నిజంగానే చెల్లవా..?

Currency Notes with Scribblings are not Invalid : చాలా మంది కరెన్సీ నోట్లపై పేర్లు, నెంబర్​లు రాస్తారు. కానీ అలా రాస్తే అవి చెల్లుతాయా? లేదా? అనే ప్రశ్నలు వస్తాయి. నిజంగానే వాటిపై చేతిరాతలు రాస్తే అవి చెల్లవా? ఆర్​బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే మీరు కచ్చితంగా ఈ స్టోరీ చదివేయాల్సిందే.!

Written with Pen on Currency Notes Its Not Valid
Currency Notes with Scribblings are not Invalid

Currency Notes with Scribblings are not Invalid? :కరెన్సీ నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్​బీఐ) ప్రింటింగ్ ప్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు తళతళలాడుతూ ఉంటాయి. అవి మార్కెట్​లోకి వచ్చి నాలుగు చేతులు మారాక వాటి రూపురేఖలు కాస్త మారుతుంటాయి. ఇందులో ప్రధానమైన మార్పు.. "రైటర్స్" ద్వారానే ఉంటుంది! అవును.. కరెన్సీ నోటు(Currency Notes) మీద ఉండే ఖాళీ స్థలంలో.. ఏదో కళాఖండాన్ని గీయడమో.. లేదంటే ఏదో ఒక పేరు రాయడమో చేస్తుంటారు. మరీకొందరు లెక్కలు కూడా రాస్తుంటారు.

PIB on Scribbling Currency Notes :అయితే.. నోట్ల రద్దు తర్వాత.. కరెన్సీ నోట్లపై ఎలాంటి రాతలూ రాయకూడదని.. రాస్తే.. అవి చెల్లకుండా పోతాయనే ప్రచారం గట్టిగానే సాగింది. మరి, నిజంగానే పెన్నుతో రాసిన కరెన్సీ నోట్లు చెల్లవా..? వాస్తవం ఏంటి..? అన్నది ఇప్పుడు చూద్దాం.

రూ.500 నోటు.. ఒరిజినలా..? నకిలీదా..? ఎలా తెలుసుకోవడం?

Scribbling on Currency Notes Makes it Invalid :

కొత్తగా వచ్చిన 500 నోట్లు.. ఇంకా 100, 200 నోట్లపై ఎలాంటి రాతలూ రాయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందంటూ సామాజిక మాధ్యల్లో జోరుగా ప్రచారం సాగిందిం. చాలా మంది ఈ వార్తను నిజమే ఏని నమ్మారు. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం స్పందించి, క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారం అవాస్తవమని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) కొట్టిపారేసింది.

కరెన్సీ నోట్లపై పెన్నుతో రాసినప్పటికీ అవి చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. వీటి విషయంలో బ్యాంకులు లేదా ఇతర దుకాణాలు చెల్లవని నిరాకరించటం కుదరదని తేల్చి చెప్పింది. అదే సమయంలో.. ప్రజలకు ఒక సూచన కూడా చేసింది. కరెన్సీ నోట్లను క్లీన్​గా ఉంచాలనే ఉద్దేశంతో.. వాటిపై ఎలాంటి రాతలూ ఉండకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది.

కరెన్సీ నోట్లపై రాతలు రాస్తే.. వాటి జీవితకాలం తగ్గుతుందని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(PIB) తన ట్విటర్​లో పేర్కొంది. అలా నోట్లపై రాతలు రాయడం వల్ల అవి త్వరగా పాడైపోతాయని చెప్పింది. చూసేందుకు కూడా అవి బాగుండవని చెప్పుకొచ్చింది. ఇవి త్వరగా పాడైపోతే.. RBI వాటిని త్వరగా వెనక్కు తీసుకుని.. మళ్లీ కొత్త నోట్లను ముద్రించాల్సి వస్తుంది. ఇలా ప్రతిసారీ చేయడం వల్ల ప్రజాధనం వృథా అవుతుంది. కాబట్టి.. నోట్లపై రాతలు రాయకుండా.. వాటి జీవితకాలాన్ని పెంచేందుకు కృషి చేయాలని కోరుతోంది. మరి.. నిజమేంటో తెలుసుకున్నారు కదా? సో.. ఇకపై నోట్ల మీద ఎలాంటి రాతలు రాయకండి.

Damaged Currency Exchange : మీ దగ్గర చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయా?.. సింపుల్​గా మార్చుకోండిలా!

Rs 2000 Notes Exchange News : రూ.2 వేల నోట్లపై RBI కీలక ప్రకటన.. 93% నోట్లు వాపస్!

How to Exchange Rs. 2000 Notes in Amazon Pay : అమెజాన్ పే ద్వారా.. రూ.2 వేల నోట్లను ఇలా మార్చుకోవచ్చు..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details