తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ క్రెడిట్ కార్డులతో ఎయిర్​పోర్ట్ లాంజ్​ యాక్సెస్ ఫ్రీ​! బోలెడు బెనిఫిట్స్ కూడా! - ఫ్రీ లాంజ్​ యాక్సెస్​ను అందించే బ్యాంకులు

Credit Cards Free Lounge Access : బ్యాంకులు క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రివార్డ్ పాయింట్లు ఇస్తుంటాయి. అలాగే ఆయా పండుగ సీజన్లలో ప్రత్యేకంగా ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా అందిస్తుంటాయి. వీటితో పాటు ప్రస్తుతం చాలా బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు యూజర్లకు.. ఫ్రీ ఎయిర్​పోర్ట్ లాంజ్​ యాక్సెస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మరి అవి ఏమిటో చూద్దామా?

Credit Cards For Best Airport Lounge Access In India At Free Of Cost
Credit Cards Free Lounge Access

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 3:34 PM IST

Credit Cards Free Lounge Access :బ్యాంకులు సాధారణంగా తమ క్రెడిట్ కార్డ్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆఫర్లు, క్యాష్​బ్యాక్​లు అందిస్తుంటాయి. వీటితోపాటు నేడు చాలా బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ యూజర్లకు.. ఫ్రీ ఎయిర్​పోర్ట్ లాంజ్​ యాక్సెస్​ను అందిస్తున్నాయి.

లాంజ్​ యాక్సెస్​ అంటే ఏమిటి..?
ఎయిర్​పోర్ట్​లో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా లాంజ్​లు ఉంటాయి. ఈ లాంజ్​ల్లో ఆహార పదార్థాలు, పానీయాలు, స్పా లాంటి వివిధ సౌకర్యాలు ఉంటాయి. వీటి ధరలు కూడా భారీగా ఉంటాయి. అందుకే పలు బ్యాంకులు తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ ఎయిర్​పోర్ట్​ లాంజ్​ల్లోకి ఫ్రీ యాక్సెస్​ కల్పించే క్రెడిట్​ కార్డులను అందిస్తున్నాయి. వీటి ద్వారా కాంప్లిమెంటరీ ఫుడ్​, డ్రింక్స్​ పొందవచ్చు. అంతే కాదు ఉచితంగా స్పా లాంటి సౌకర్యాలను వినియోగించుకోవచ్చు.

HDFC Diners Club Privilege Credit Card :

  • ఈ హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్ కార్డ్​​ వార్షిక రుసుము రూ.2,500 ఉంటుంది.
  • ముందటి సంవత్సరంలో ఈ కార్డును రూ.3 లక్షల పరిమితికి మించి వినియోగిస్తే.. వార్షిక రుసుము నుంచి మినహాయింపు లభిస్తుంది.
  • ఈ కార్డు ద్వారా దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని లాంజ్​లను 12 సార్లు ఉచితంగా విజిట్ చేయవచ్చు.
  • ఈ సౌలభ్యం సాధరణ కస్టమర్లతో పాటు యాడ్​-ఆన్​ కార్డ్​ కస్టమర్లకు కూడా వర్తిస్తుంది.
  • Amazon Prime, MMT BLACK, Times Prime ఫ్రీ మెంబర్​షిప్ పొందవచ్చు.
  • వీటితో పాటు గిఫ్ట్​ వోచర్స్​ కూడా లభిస్తాయి.

Axis Bank Select Credit Card :

  • ఈ కార్డ్​ వినియోగదారులు వార్షిక రుసుము కింద రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది.
  • ఈ కార్డు ద్వారా సంవత్సరానికి 6 అంతర్జాతీయ, 8 దేశీయ ఫ్రీ లాంజ్​ విజిట్​లు చేయవచ్చు.
  • ఈ కార్డు వినియోగదారులు బిగ్​బాస్కెట్​ కొనుగోళ్లపై 20 శాతం, స్విగ్గీ ఆర్డర్లపై 40 శాతం వరకు డిస్కౌంట్​ పొందవచ్చు.
  • అదనంగా ఏడాదిలో ఆరు గోల్ఫ్​ గేమ్​లను ఉచితంగా ఆడేందుకు వీలుంటుంది.

SBI Prime Credit Card :

  • ఎస్​బీఐ ప్రైమ్ క్రెడిట్​ కార్డు ఉన్నవారు యాన్యువల్​​ ఫీజు కింద ఏడాదికి రూ.2,999 రుసుమును చెల్లించాలి.
  • ఒక్క సంవత్సరంలో ఈ కార్డు రూ.3 లక్షల పరిమితి మించి ఉపయోగిస్తే యాన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.
  • ఈ కార్డు ద్వారా ఒక ఏడాదిలో 4 అంతర్జాతీయ​, 8 దేశీయ లాంజ్ విజిట్​లను పూర్తి ఉచితంగా పొందవచ్చు.
  • అదనంగా ఈ-గిఫ్ట్ కార్డ్‌లు, అడిషనల్​ రివార్డ్​ పాయింట్లు, వోచర్​లు లాంటి ఎక్స్​ట్రా బెనిఫిట్స్​ను కూడా లభిస్తాయి.

SBI Elite Credit Card :

  • ఎస్​బీఐ ఎలైట్​ క్రిడిట్​ కార్డ్​ ఉన్నవారు సంవత్సరానికి రూ.4,999 వార్షిక రుసుము కింద చెల్లించాల్సి ఉంటుంది.
  • ఈ కార్డ్​ ద్వారా ఏడాదికి 6 విదేశీ, 8 దేశీయ ఎయిర్​పోర్ట్​ లాంజ్​లను ఫ్రీగా యాక్సెస్​ చేయవచ్చు.
  • రూ.5,000 విలువగల వెల్​కం గిఫ్ట్​ సర్టిఫికేట్​ కూడా లభిస్తుంది.
  • డైనింగ్, సూపర్ మార్కెట్​, డిపార్ట్‌మెంట్ షాప్​ కొనుగోళ్లపై 5X రివార్డులను సొంతం చేసుకోవచ్చు.
  • ఒక సంవత్సరంలో మొత్తంగా రూ.6,000 విలువైన ఫ్రీ సినిమా టికెట్లను కూడా పొందవచ్చు.

YES FIRST Preferred Credit Card :

  • ఈ క్రెడిట్​ కార్డ్​ యానువల్​ ఫీజు కింద రూ.999 చెల్లించాలి.
  • ఒక సంవత్సరంలో మీరు రూ.2.5 లక్షల పరిమితికి మంది ఈ కార్డు ద్వారా కొనుగోళ్లు చేస్తే.. ఈ వార్షిక రుసుము నుంచి మినహాయింపు లభిస్తుంది.
  • ఈ కార్డ్​ ఉన్నవారు ఏడాదికి 4 అంతర్జాతీయ, 8 దేశీయ ఎయిర్​పోర్టు లాంజ్​లను ఉచితంగా​ యాక్సెస్​ చేయవచ్చు.
  • కొన్ని రకాల వస్తువులపై రూ.100 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే 8 రివార్డ్ పాయింట్లను పొందవచ్చు.
  • సంవత్సరానికి 4 సార్లు ఉచితంగా గోల్ఫ్ గేమ్స్ ఆడవచ్చు.

జనవరిలో అన్ని కార్ల ధరలు హైక్? ఈలోగా కొనుక్కోవడమే బెటర్?

ఇన్సూరెన్స్ కంపెనీ లాభాల్లో వాటా కావాలా? ఈ పాలసీ ఎంచుకుంటే డబుల్​ ప్రాఫిట్​!

ABOUT THE AUTHOR

...view details